ఇటీవల గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ చళ్ళమళ్ళ శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమనాధ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం. “ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్” ( ఎఫ్.ఆర్.ఓ) చళ్ళమళ్ళ శ్రీనివాసరావు హత్య కేసులో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. “ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్” హత్య కేసులో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందు ఈ ఘటనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన “అడవులు వ్యవహారలపై సుప్రీంకోర్టు లో “అమైకస్ క్యూరీ” ( న్యాయ సలహాదారు) గా ఉన్న న్యాయవాది ఏడిఎన్ రావు.. పిటీషన్ దాఖలు చేయడంతో పాటు, ధర్మాసనం ముందు వాదనలు కూడా వినిపించారు.
Also Read : Chiranjeevi: వాల్తేరు వీరయ్య టీమ్ కు చిరు షాక్.. లిటిల్ సర్ప్రైజ్ అని సాంగ్ లీక్
దీంతో.. ఈ ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని అడవుల వ్వవహారాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన “సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ” ని ఆదేశించింది ధర్మాసనం. ఈ ఏడాది నవంబర్ 23 తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలంలో ఎర్రబోడు అడవుల్లో అటవీ అధికారి పై “గుత్తి కోయ ఆదివాసుల” బృందం దాడి చేశారు. “పోడు భూములు” విషయంలో “గుత్తి కోయ ఆదివాసీలు” బృందం కొడవళ్లు, కత్తులతో “ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్” ( ఎఫ్.ఆర్.ఓ) చళ్ళమళ్ళ శ్రీనివాసరావు పై దాడి చేయడంతో.. ఈ దాడిలో అటవీ అధికారి మృతి చెందినట్లు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సుప్రీంకోర్టు అమైకస్ క్యూరీ సుమోటాగా పిటిషన్‌ను దాఖలు చేశారు.