Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్‌ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ప్రభుత్వ సంస్థ అయిన TASMAC కి సంబంధించిన కేసని తెలిపారు. ప్రభుత్వ సంస్థపై ఎలా దాడులు చేస్తారని ప్రశ్నించారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లపై దాడులు జరిగాయని ఆయన కోర్టుకు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రభుత్వ సంస్థ కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇది దిగ్భ్రాంతికరమని వాపోయారు.
READ MORE: Maganti Sunitha Gopinath : మాగంటి సునీత గోపినాథ్ కు బీఆర్ఎస్ బీ-ఫామ్.. రేపే నామినేషన్
ఎఫ్ఐఆర్ అనంతరం.. ఈసీఐఆర్ పూర్త చేసి.. ఈ కేసును క్షణాల్లో ముగించవచ్చు.. అనంతం ప్రభుత్వం ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనవసరంగా రాష్ట్రాన్ని వేధిస్తోందని సిబల్ తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్‌వీ రాజు మాట్లాడుతూ, మొత్తం 47 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని.. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు.. ఈ నేరాలపై ఈడీ పని చేస్తోందని తెలిపారు. ఈ అధికారులందరిపై కంపెనీ డబ్బును అక్రమంగా ఎలా ప్రక్షాళన చేసిందో తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఈడీ దాడి ప్రక్రియ దర్యాప్తునకు ఒక మార్గమని స్పష్టం చేశారు. స్థానిక పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేయలేకపోతున్నారా..? అని సీజేఐ గవాయ్ ఏఎస్జీని అడిగారు. రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారని సిబల్ బదులిచ్చారు. దీంతో సీజేఐ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “మరి సమాఖ్య నిర్మాణం సంగతేంటి..? సమాఖ్య వ్యవస్థకు ఏమైంది..? శాంతిభద్రతలను ఎవరు నియంత్రిస్తారు..?” అని ఈడీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఈ వేడి చర్చ మధ్య, ఇది శాంతిభద్రతల సమస్య కాదని ఏఎస్‌జీ పేర్కొన్నారు. “రాష్ట్ర పోలీసుల హక్కులను ఉల్లంఘించడం లేదా? మీకు అనుమానం వచ్చినప్పుడల్లా మీ సొంతంగా దర్యాప్తు చేస్తారా? ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదా? శాంతి భద్రతలను ఎవరు నియంత్రిస్తారు. గత ఆరేళ్లలో ఈడీకి సంబంధించి ఎన్నో కేసులు చూశాను. మళ్లీ నేనేం చెప్పదలచుకోలేదు.” అని గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
