Sajjala Bhargava Reddy: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవరెడ్డికి ఎదురుదెబ్బ!
- సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరణ
- భార్గవరెడ్డి తరఫున కపిల్ సిబల్ వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భార్గవరెడ్డి పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విజ్ఞప్తులను ఏపీ హైకోర్టు ముందే చెప్పుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సజ్జల భార్గవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని కపిల్ చెప్పగా.. చట్టాలు ఎప్పటివనేది కాదని, మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలు చూడాలని లూథ్రా వాదించారు. సుప్రీంకోర్టు ముందు చాలా విషయాలు గోప్యంగా ఉంచామని లూథ్రా వెల్లడించారు. దుర్భాషలు ఉపయోగించే ఎవరైనా చట్టపర పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం పేర్కొంది.
సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం తనపై దాఖలు చేసిన కేసులను కొట్టివేయాలని సుప్రీంకోర్టును సజ్జల భార్గవరెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఈరోజు అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఇకపై తనపై కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సజ్జల దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. సజ్జల వాదనలను ఏపీ హైకోర్టులో వినిపించాలని, అక్కడే పిటీషన్‌లు దాఖలు చేయాలని సూచించింది. ఏపీ హైకోర్టును ఆశ్రయించేంత వరకూ 2 వారాల పాటు సజ్జలను అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. రెండు వారాల తరువాత మధ్యంతర రక్షణను పొడిగించాలా? లేదా? అన్నది హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.
Also Read
- IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
- PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
తాజావార్తలు
-
Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
-
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
-
Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బట్వారా1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
-
Amrit Bharat Express: 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ
-
Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!