వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భార్గవరెడ్డి పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విజ్ఞప్తులను ఏపీ హైకోర్టు ముందే చెప్పుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సజ్జల భార్గవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని కపిల్ చెప్పగా.. చట్టాలు ఎప్పటివనేది కాదని, మహిళలపై…