Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తుది జట్టులో అవకాశం దక్కకపోయినా.. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సహనంతో ఉంటూ తన ఆటపైనే దృష్టి పెట్టాలని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూచించాడు. బెంగళూరులో వర్షం కారణంగా రద్దయిన ఐదో మ్యాచ్‌తో ఈ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లలోనూ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్ మ్యాచ్‌లోనే అతను చివరిసారిగా భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఇప్పటివరకు ఆడిన 8 టీ20 మ్యాచ్‌లలో ఈ యువ ఆటగాడు 186 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధశతకాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సిరీస్ అంతటా సంజూ శాంసన్, అభిషేక్ శర్మల రూపంలోనే అనుభవజ్ఞులైన ప్లేయర్లపైనే భారత్ భారం మోపింది. సంజూ ఐదు మ్యాచ్‌లలో 168 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 145 పరుగులు జోడించాడు. వీరిద్దరూ చెరో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో, వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కడం కష్టంగా మారింది.
ఇక, ఐదో టీ20 ముగిసిన తర్వాత మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. అవకాశాలు రాలేదని ఆందోళన చెందకుండా, సూర్యవంశీ తన ప్రిపరేషన్‌ను నమ్ముకోవాలని, రిలాక్స్‌గా ఉండాలని వివరించాడు. “వైభవ్‌తో నేను నిత్యం చెబుతుంటాను, నీకు తప్పకుండా అవకాశాలు వస్తాయి. నీ ప్రాసెస్‌లో స్థిరంగా ఉంటూ, మనసును తేలికగా ఉంచుకుని, అవకాశం రాలేదని ఎక్కువగా ఆలోచించవద్దు.. కొన్నిసార్లు వేచి చూడాల్సి ఉంటుంది. మనకు నిలకడగా రాణిస్తున్న ఇద్దరు అద్భుతమైన ఓపెనర్లు ఉన్నారు” అని కెప్టెన్ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భారత ప్రదర్శనపై స్పందిస్తూ.. రెండు, నాల్గవ మ్యాచ్‌లలో బౌలర్లు మరింత ప్రభావవంతంగా రాణించి ఉంటే సిరీస్ ఫలితం వేరేలా ఉండేదని, ఆ రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థికి 240కి పైగా పరుగులు సమర్పించుకున్నామని అయ్యర్ చెప్పాడు. బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. వెస్టిండీస్ జట్టు అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. “మనం బాగా బౌలింగ్ చేసి ఉంటే సిరీస్ స్కోర్‌లైన్ వేరేలా ఉండేది. బ్యాటింగ్ అద్భుతంగా సాగింది, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరే కాస్త వెనుకబడ్డాం. క్రెడిట్ ఇవ్వాల్సిందే, వాళ్ళు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. షాయ్ హోప్ అయితే సూపర్ అనిపించాడు. ఓటమి తర్వాత కూడా పుంజుకునే సత్తా ఉండటం పెద్ద సానుకూలాంశం. సిరీస్ అంతటా నిలకడగా రాణించలేకపోయాం, కాబట్టి ఇదొక గొప్ప లెర్నింగ్. ఇవాళ కూడా మేము బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో చాలా సవాల్‌తో కూడిన సిరీస్ ఉండబోతోంది” అని ముగించాడు.
Also Read
- Mushroom Pulao Recipe: ప్రోటీన్ ఫుల్, టేస్ట్ సూపర్..! అన్నం ముద్దవ్వకుండా బిర్యానీకి మించిన రుచితో 'మష్రూమ్ పులావ్'..!
- Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
- Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే 'మసాలా పన్నీర్ పరాటా' ఇలా చేసుకోండి..!
తాజావార్తలు
-
Mushroom Pulao Recipe: ప్రోటీన్ ఫుల్, టేస్ట్ సూపర్..! అన్నం ముద్దవ్వకుండా బిర్యానీకి మించిన రుచితో ‘మష్రూమ్ పులావ్’..!
-
Hardik Pandya: ‘చివరికి, ఆమె నాది’.. మహికా శర్మకు రింగ్ తొడిగిన హార్దిక్ పాండ్యా?.. నిశ్చితార్థంపై జోరుగా ప్రచారం
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
ట్రెండింగ్
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!