AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం నేటితో ముగియనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. ముఖ్యంగా విజయవాడలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ ఉదయం 9.30 గంటలకు నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరనున్నారు. జనసేన మేయర్ అభ్యర్ధిగా ఆయన నామినేషన్ వేయనున్నారు. వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వీఎంసీకి రాధాకృష్ణ వెళ్లనున్నారు. అదే సమయంలో వైసీపీ తరఫున రాయన భాగ్యలక్ష్మ కూడా ఉదయం 9.30 గంటలకు నామినేషన్ వేయనున్నారు. మరోవైపు ఏబీ వెంకటేశ్వరరావు మధ్యాహ్నం 1 గంటకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది.
Also Read
- Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
- IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
నామినేషన్ల స్వీకరణ ముగిసిన అనంతరం ఈ నెల 19న నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 21 వరకు అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టమవుతుంది. అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో నామినేషన్ల చివరి రోజు నుంచి పోలింగ్ వరకు రాష్ట్రంలోని మున్సిపల్ ప్రాంతాల్లో రాజకీయ కార్యకలాపాలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
-
Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!