Site icon NTV Telugu

Waqf Amendment Act: వక్ఫ్‌ చట్టం పిటిషన్లపై సుప్రీంలో ముగిసిన విచారణ..

Supreme Court

Supreme Court

వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో పది పిటిషన్లను ఈ రోజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురుసభ్యుల ధర్మాసనం వాటిని విచారించింది. వక్ఫ్‌ చట్టరూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందరికీ వర్తించే ఈ నిబంధన లౌకికమైన స్వభాన్ని కలిగిఉందని స్పష్టం చేసింది. కేంద్రానికి సైతం సుప్రీం పలు ప్రశ్నలు సంధించింది. వందల ఏళ్లనాటి ఆస్తులకు పత్రాలు ఎక్కడినుంచి వస్తాయి? అని ప్రశ్నించింది. వక్ఫ్‌ చట్టాన్ని నిషేధించాలని జరుగుతున్న ఆందోళలనలపై సుప్రీం స్పందించింది. ఆందోళనల్లో చోటు చేసుకున్న హింస బాధాకరమంది.

READ MORE: IPL 2025 : ఐపీఎల్ 2025లో ఫిక్సింగ్ ముప్పు.. హైదరాబాద్ వ్యాపారవేత్తపై బీసీసీఐ అలర్ట్

పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ , కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21, 25, 26 ప్రకారం మత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను ఈ చట్టం ఉల్లంఘిస్తుందని పిటిషన్లు పేర్కొన్నారు. ఈ చట్టం జాతీయస్థాయి పరిణామాలను కలిగి ఉందని, ఈ పిటిషన్లను హైకోర్టుకు రిఫర్ చేయొద్దని మరో సీనియర్ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కోరారు. వక్ఫ్‌ బై యూజర్ అనేది ఎప్పటినుంచో అమల్లో ఉన్న పద్ధతి అని మరో న్యాయవాది హుజేఫా అహ్మదీ వెల్లడించారు. మరోపక్క.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ వక్ఫ్‌ బిల్లుపై విస్తృత చర్చ జరిపిందని కేంద్రం కోర్టుకు వెల్లడించింది. అనంతరం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

Exit mobile version