వక్ఫ్ (సవరణ) చట్టం 2025 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్నలు సంధించింది. ముస్లింలను హిందూ మత ట్రస్టులలో చేరడానికి అనుమతిస్తారా ? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అనేక వక్ఫ్ ఆస్తులకు రిజిస్ట్రీ వంటి పత్రాలు లేనప్పుడు.. 'వక్ఫ్ బై యూజర్' చెల్లదని ఏ ప్రాతిపదికన ప్రకటిస్తారు? అని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్…
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో పది పిటిషన్లను ఈ రోజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురుసభ్యుల ధర్మాసనం వాటిని విచారించింది. వక్ఫ్ చట్టరూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది విచారణ.. ఈ రోజు మరోసారి విచారణకు రానుంది చంద్రబాబు పిటిషన్