వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో పది పిటిషన్లను ఈ రోజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురుసభ్యుల ధర్మాసనం వాటిని విచారించింది. వక్ఫ్ చట్టరూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.