Supreme Court: చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీం కోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది విచారణ.. ఈ రోజు మరోసారి విచారణకు రానుంది చంద్రబాబు పిటిషన్.. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం చంద్రబాబు పిటిషన్పై విచారణ చేపట్టనుంది.. కాగా, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.
Read Also: Vijay: త్వరలో దళపతి 68 ఫస్ట్ లుక్ లాంచ్?
Also Read
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత.. వరుసగా ఆయనపై కేసులు నమోదు చేశారు.. అమరావతి ఇన్నిర్ రింగ్ కేసు, ఫైబర్ నెట్ కేసు.. ఇలా వరుసగా చంద్రబాబుపై కేసులు పెట్టారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో 50 రోజులకు పైగా ఉన్న చంద్రబాబుకు ముందుగా మధ్యంతర బెయిల్.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో బెయిల్ వచ్చింది.. మరోవైపు.. తనపై ఇతర కేసుల్లోనూ కోర్టులను ఆశ్రయించారు చంద్రబాబు.. పైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై నవంబర్ 30న విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం.. తదుపరి విచారణ డిసెంబరు 12కి అనగా నేటికి వాయిదా వేసింది. 17ఏపై చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో.. ఆ అంశంపై తీర్పు వచ్చాకే ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారిస్తామని గతంలో పేర్కొంది సుప్రీంకోర్టు.. ఇక, ఈ రోజు విచారణ ఏ విధంగా సాగనుంది.. ఎలాంటి తీర్పు సుప్రీంకోర్టు వెలువరిస్తోంది అనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!