Fibernet Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. సీజేఐకి ద్విసభ్య ధర్మాసనం విన్నవించిన విషయం విదితమే కాగా.. నేడు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. దీంతో.. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు.. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు.. ఈ రోజు చంద్రబాబు పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలాఎం త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే, 17ఏపై స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయం విదితమే.
Read Also: Astrology: జనవరి 17, బుధవారం దినఫలాలు
ఇక, 17ఏ పై మంగళవారం తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం విదితమే.. దీంతో, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది ఉత్కంఠగా మారింది. అసలు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసు విచారణను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిబ్ బేలా ఎం త్రివేది ధర్మాసనం చేపట్టబోతోంది. కాగా, ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై అభియోగాలు మోపింది సీఐడీ.. తన అనుకూల వర్గానికి కాంట్రాక్ట్ ఇచ్చారని, వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని పేర్కొన్న విషయం విదితమే.