Reliance Share: ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని నిలిపిన రిలయన్స్ .. 55శాతం పెరిగిన సంపద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Share: భారత స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరిట మరో సరికొత్త రికార్డు నమోదైంది. భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.20 లక్షల కోట్లు దాటిన తొలి భారతీయ కంపెనీగా అవతరించింది. ఈ అద్భుత రికార్డును చేరుకునే ప్రయాణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీతో పాటు తన పెట్టుబడిదారులను కూడా ధనవంతులను చేసింది.
లక్ష కోట్ల రూపాయల కంపెనీల క్లబ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేరడం దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగింది. మొదటిసారిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 2005లో లక్ష కోట్ల రూపాయల MCAPని సాధించింది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.20 లక్షల కోట్లు దాటింది. రూ.లక్ష కోట్ల నుంచి రూ.20 లక్షల కోట్ల విలువైన ఈ ప్రయాణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఇన్వెస్టర్లకు దాదాపు 30 రెట్లు రిటర్న్స్ ఇచ్చింది.
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
Read Also:RC 16: బుచ్చి మావా… నువ్వు కొట్టే హిట్ సౌండ్ పాన్ వరల్డ్ వినిపించాలి…
నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ప్రారంభ సెషన్‌లో 0.53 శాతం నష్టంతో రూ.2,945 దగ్గర ట్రేడవుతోంది. నేటి స్వల్ప పతనం కారణంగా, కంపెనీ ఎమ్‌క్యాప్ కూడా రూ.20 లక్షల కోట్ల నుంచి రూ.19.93 లక్షల కోట్లకు స్వల్పంగా తగ్గింది. అయితే, ఒక రోజు క్రితం ఈ షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 2,969.45కి చేరుకుంది. ఎంక్యాప్ రూ. 20 లక్షల కోట్లను దాటింది.
దాదాపు 20 ఏళ్ల క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఒక షేరు ధర దాదాపు రూ.110 మాత్రమే. ఈ విధంగా చూస్తే, ఫిబ్రవరి 2005 నుండి ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 2,600 శాతం పెరిగింది. అంటే షేరు ధరలు 27 రెట్లు పెరిగాయి. జూలై 2002 నుండి ఇప్పటి వరకు, స్టాక్ దాదాపు 5,500 శాతం అంటే 56 రెట్లు బలపడింది. అప్పట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఒక షేర్ విలువ రూ.53 మాత్రమే.
Read Also:Sarfaraz Khan: సర్ఫరాజ్ సతీమణి భావోద్వేగం.. వీడియో వైరల్!
తాజావార్తలు
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!