Site icon NTV Telugu

YS Sharmila: తెలంగాణలో పోటీపై షర్మిల సంచలన నిర్ణయం

New Project 2023 11 03t122749.205

New Project 2023 11 03t122749.205

YS Sharmila: తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆమె ఇప్పుడు పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని వైఎస్ ఆర్ టీపీ నిర్ణయించిందన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు షర్మిలతో లోటస్ పాండ్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయకుండా.. కాంగ్రెస్‌కి సహకరించాలని నేతలు కోరారు. గతంలో పొత్తు, సయోధ్య కుదరలేదు. కాంగ్రెస్ నేతలతో మరో సారి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చితే.. చరిత్ర నన్ను క్షమించదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్టీపీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Read Also:Revanth Reddy: కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి.. శ్రీమంతుల తల్లిని చూపించారూ.. రేవంత్‌ కామెంట్‌

మరి కొద్ది రోజుల్లో జరుగబోవు ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయట్లేదని తెలిపారు. తన పార్టీని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. కేసీఆర్ నియంత పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న లక్ష్యం వైఎస్ఆర్టీపీది. ఇందులో భాగంగానే ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్టీపీని స్థాపించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిసిస్తూ వచ్చారు. పార్టీ స్థాపించక ముందే 42 మంగళవారాలు నిరసన దీక్షలు చేశామన్నారు. 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశామన్నారు. తెలంగాణ లో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది. కేసీఆర్ మీద వ్యతిరేక ఓటు చీల్చి తే మళ్లీ కేసీఆర్ సీఎం అవుతాడు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది అని చాలా మంది చెప్తున్నారు. వైఎస్సార్ తయారు చేసిన కాంగ్రెస్ ను ఓడించ వద్దు అని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసే ఆలోచన నాకు లేదన్నారు.

Read Also:Best Fielder Medal: స్పెషల్‌ పర్సన్‌తో బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డు అనౌన్స్‌మెంట్.. శ్రీలంకతో మ్యాచ్‌లో ఎవరంటే?

గత వారంలో 119 నియోజకవర్గంలో పోటీ చేస్తామని ప్రకటించాం. ఈ వారంలో చాలా మార్పులు వచ్చాయి. మళ్ళీ కేసీఆర్ సీఎం అయితే ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తుందని షర్మిళ అన్నారు. అందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు కష్టం కొంచెం బాధగా కూడా ఉంది. ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అన్నారు. నేను తప్పు చేస్తే నన్ను క్షమించమని కోరారు. పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కోరారు. పాలేరు నుంచి పోటీ చేద్దాం అనుకున్నాను. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శీనన్న నిలబడుతున్నాడు.. తాను పాదయాత్ర చేసినప్పుడు నా పక్కన నడిచినవాడు పొంగులేటి శీనన్న… వైఎస్సార్ చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర లో నాతో నిలబడ్డాడు. అలాంటి పొంగులేటి ని నేను ఎలా ఓడించను..గెలుపు గొప్పదే.. దాని కంటే త్యాగం ఇంకా గొప్పదన్నారు వైఎస్ షర్మిళ. ప్రచారం లో పాల్గొనే అవకాశం త్వరలోనే ఆలోచిస్తానన్నారు.

 

Exit mobile version