YS Sharmila: తెలంగాణలో పోటీపై షర్మిల సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆమె ఇప్పుడు పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని వైఎస్ ఆర్ టీపీ నిర్ణయించిందన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు షర్మిలతో లోటస్ పాండ్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయకుండా.. కాంగ్రెస్‌కి సహకరించాలని నేతలు కోరారు. గతంలో పొత్తు, సయోధ్య కుదరలేదు. కాంగ్రెస్ నేతలతో మరో సారి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చితే.. చరిత్ర నన్ను క్షమించదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్టీపీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
Read Also:Revanth Reddy: కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి.. శ్రీమంతుల తల్లిని చూపించారూ.. రేవంత్ కామెంట్
Also Read
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
మరి కొద్ది రోజుల్లో జరుగబోవు ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయట్లేదని తెలిపారు. తన పార్టీని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. కేసీఆర్ నియంత పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న లక్ష్యం వైఎస్ఆర్టీపీది. ఇందులో భాగంగానే ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్టీపీని స్థాపించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిసిస్తూ వచ్చారు. పార్టీ స్థాపించక ముందే 42 మంగళవారాలు నిరసన దీక్షలు చేశామన్నారు. 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశామన్నారు. తెలంగాణ లో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది. కేసీఆర్ మీద వ్యతిరేక ఓటు చీల్చి తే మళ్లీ కేసీఆర్ సీఎం అవుతాడు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది అని చాలా మంది చెప్తున్నారు. వైఎస్సార్ తయారు చేసిన కాంగ్రెస్ ను ఓడించ వద్దు అని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసే ఆలోచన నాకు లేదన్నారు.
గత వారంలో 119 నియోజకవర్గంలో పోటీ చేస్తామని ప్రకటించాం. ఈ వారంలో చాలా మార్పులు వచ్చాయి. మళ్ళీ కేసీఆర్ సీఎం అయితే ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తుందని షర్మిళ అన్నారు. అందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు కష్టం కొంచెం బాధగా కూడా ఉంది. ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అన్నారు. నేను తప్పు చేస్తే నన్ను క్షమించమని కోరారు. పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కోరారు. పాలేరు నుంచి పోటీ చేద్దాం అనుకున్నాను. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శీనన్న నిలబడుతున్నాడు.. తాను పాదయాత్ర చేసినప్పుడు నా పక్కన నడిచినవాడు పొంగులేటి శీనన్న… వైఎస్సార్ చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర లో నాతో నిలబడ్డాడు. అలాంటి పొంగులేటి ని నేను ఎలా ఓడించను..గెలుపు గొప్పదే.. దాని కంటే త్యాగం ఇంకా గొప్పదన్నారు వైఎస్ షర్మిళ. ప్రచారం లో పాల్గొనే అవకాశం త్వరలోనే ఆలోచిస్తానన్నారు.
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!