Revanth Reddy: కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి శ్రీమంతుల తల్లిని చూపించారూ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో రాజకీయాలు జూన్ 2.2014 ముందు.. తర్వాత అని చర్చ చేస్తామన్నారు. సీమాంధ్ర పాలకులు దోపిడీ చేశారు అనేది బీఆర్ఎస్ వాదన అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ..సామాజిక న్యాయం.. సమాన అభివృద్ధి కోరుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోవడం సహించలేమన్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాటం లో ధర్మం ఉందని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. మట్టికి పోయినా ఇంటి వాడు పోవాలని కేసీఆర్ చెప్తారన్నారు. ఆయన చెప్పిన నీళ్లు వచ్చాయా..? పల్లెలకు నిధులు వచ్చాయా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఉద్యమంలో టీజీ అని అనుకున్నామన్నారు. కానీ తెలంగాణా వచ్చాకా టీఎస్ పెట్టుకున్నాడని మండిపడ్డారు.
తెలంగాణ తల్లి ముఖంలో దర్పం.. ప్రేమ.. త్యాగం ఉండాలన్నారు. కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి శ్రీమంతుల తల్లిని చూపించారూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాచరిక పోకడలు కేసీఆర్ వి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత నిర్బంధం లేదన్నారు. సెక్రటేరియట్ కి.. ప్రతిపక్ష సబ్యులకు.. మీడియాకు అనుమతి లేదన్నారు. కేసీఆర్.. నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్ అన్నారు. క్రిమినల్ ని ఎదుర్కోవచ్చు.. నియంతను ఎదుర్కోవచ్చు.. కానీ.. నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ ని ఎదుర్కోవడం కోసం కొత్త దారులు వేతకాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్రం ఒక్క వ్యక్తి ఉక్కుపాదం కింద నలిగిపోతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని కాంగ్రెస్ విశ్వసిస్తోందన్నారు. అందుకే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంలో సోనియా కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.
రాష్ట్ర చిహ్నంలోనే రాజయ్య పోకడలు కనిపిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో ఆలోచించుకోవాలని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఆ నిధులను పేదల సంక్షేమానికి వినియోగించారా అని ప్రజలు ఆలోచించాలి. ఆ నిధులను పేదల సంక్షేమానికి వినియోగించారా అని ప్రజలు ఆలోచించాలి. ఈ పదేళ్లలో ప్రజల ప్రాథమిక హక్కులను కేసీఆర్ రాసిచ్చారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి భయపడే విధంగా కేసీఆర్ పాలన సాగుతున్నదని విమర్శించారు. నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ ప్రాథమిక హక్కును కూడా కేసీఆర్ కాలరాశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, అభివృద్ధిని కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రజలు అమలు చేయాలన్నారు. బంగారు తెలంగాణ ఫలాలు ఎవరికి అందుతున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనపై యువత, రైతులు, మహిళలు మాట్లాడుతున్నారని అన్నారు. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్, డబ్బు పంపిణీ చేయవద్దని బీఆర్‌ఎస్ తన సవాల్‌ను స్వీకరించాలని రేవంత్‌రెడ్డి కోరారు. మేడిగడ్డ స్తంభం మూడు అడుగుల మేర కుంగిపోయిందన్నారు. పిల్లర్ దిగువన ఇసుక ఉందన్న విషయం నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. పార్టీ మొత్తాన్ని మేడిగడ్డ బ్యారేజీ వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నారా అని రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. ఓటుకు నోటు పెంచింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
TSRTC: శబరిమల భక్తులకు TSRTC గుడ్‌న్యూస్.. వారికి మాత్రమే ఉచిత ప్రయాణం!