Sachin Tendulkar picked Shreyas Iyer as the best fielder Medal: వన్డే ప్రపంచకప్ 2023లోని ప్రతి మ్యాచ్‌లో మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే భారత ఆటగాళ్లకు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గెలుచుకోగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల శ్రేయస్ గెలుచుకున్నాడు. రెండు అద్భుత క్యాచ్‌లు అందుకున్నందుకుగాను శ్రేయస్‌ను ఈ అవార్డు వరించింది. శ్రేయస్ ఈ అవార్డును గెలుచుకోవడం రెండోసారి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బెస్ట్ ఫీల్డర్ అవార్డును అందుకున్నాడు.
ప్రతి మ్యాచ్ అనంతరం సరికొత్త రీతిలో బెస్ట్ ఫీల్డర్ మెడల్ విన్నర్‌ను అనౌన్స్ చేయించే ఫీల్డింగ్ కోచ్ దిలీప్.. ఈసారి ఓ స్పెషల్ పర్సన్‌తో అనౌన్స్ చేయించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వీడియో కాల్ ద్వారా శ్రేయస్ అయ్యర్‌ను విజేతగా ప్రకటించాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలను కాదని శ్రేయస్ విజేతగా నిలిచాడు. ఇక బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను ప్రకటించడంతో పాటు అద్భుత విజయం సాధించిన భారత జట్టును సచిన్ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read: Mohammed Shami: అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం సంతోషంగా ఉంది: షమీ
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 302 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంతో రోహిత్ సేన అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. గిల్ (92), కోహ్లీ (88), శ్రేయస్ (82) హాఫ్ సెంచరీలు చేశారు. లంక బౌలర్లలో దిల్షన్ మధుశంక 5 వికెట్స్ తీశాడు. ఆపై శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. కసున్ రజిత (14) టాప్ స్కోరర్. మొహమ్మద్ షమీ 5 వికెట్స్ పడగొట్టాడు.
The Medal Ceremony 🏅 in the dressing room just attained “LEGENDARY” status 🙌🏻#TeamIndia was in for a surprise when someone 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 announced the best fielder award 🫡🔝#CWC23 | #MenInBlue | #INDvSL
WATCH 🎥🔽 – By @28anand
— BCCI (@BCCI) November 3, 2023