NTR’s 100th Birth Anniversary Celebrations: వెండితెర ఆరాధ్యుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ విజయవాడ వేదికగా ఘనంగా ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలియచేసే లక్ష్యంతో టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్ నేతృత్వంతో సావనీర్ కమిటీ ఏర్పాటయింది. 8 నెలల నుంచి ఈ కమిటీ సావనీరు రూపకల్పనతో పాటు ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా ఓ వెబ్‌సైట్, యాప్‌నకు రూపకల్పన చేస్తోంది.
Read Also: Anand Mahindra AI video: సమ్‌థింగ్ స్పెషల్.. ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్రా వీడియో..
టీడీపీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ ప్రసంగాలు తెలుగుజాతిని ఉర్రూతలూగించాయి. తెలుగుజాతి కీర్తిని స్ఫూర్తిని ప్రపంచమంతా చాటేలా ఎన్టీఆర్ ప్రసంగాలు ఉండేవి. అలాంటి ప్రసంగాలను ముందు తరాలకు అందించాలన్న ఉద్దేశంతో… ప్రసంగాల సంకలనంతో ఓ పుస్తకం, బయట చేసిన ప్రసంగాలతో మరో సంకలనం విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్‌ను విపరీతంగా అభిమానించే సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. విజయవాడ శివారు కానూరు సమీపంలో…జరిగే వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు అతిరథమహారథులు హాజరై యుగపురుషుడికి నివాళులర్పించనున్నారు. ఎన్టీఆర్ అభిమానులు.. ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారనే అంచనాతో టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ శతజయంతి సభకు ఎలాంటి ఇబ్బందులు.. ఆటంకాలు కలగకుండా చూసుకుంటోంది.