Adipuruash: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఇటీవల ఆ చిత్ర టీజర్ రిలీజయి రికార్డులు నెలకొల్పుతుంది. అదే తరుణంలో ఆ సినిమాపై వివాదాలు కూడా అధికంగానే వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై చిత్ర నిర్మాత ఓం రౌత్ కు లేఖ రాస్తానని చెప్పారు. ఆ చిత్రంలో హనుమంతుడి పాత్రధారి ధరించిన కాస్ట్యూమ్స్ తోలుతో చేయబడినది కనిపించిందన్నారు. దీంతో తమ విశ్వాసం దెబ్బతిందని.. వెంటనే ఆ చిత్రంలోని సన్నివేశాలను తొలగించాలని నిర్మాతను కోరారు. లేకపోతే ఆదిపురుష్ చిత్రనిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా ఆదిపురుష్ సినిమాలో రామాయణాన్ని తప్పుగా ప్రజెంట్ చేశారన్నారు. సినిమాలో రావణుడిని చూపించిన తీరు తప్పని అన్నారు.
Read Also: Mrunal Thakur: సూసైడ్ చేసుకుందామనుకున్న.. మృణాల్ ఠాకూర్
అయోధ్యలో అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆదిపురుష్ టీజర్ విడుదల చేశారు. కాగా, విడుదలైన కొన్ని గంటల్లోనే ఆదిపురుష్ టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. కేవలం 19 గంటల వ్యవధిలో ఈ టీజర్ ను 63 మిలియన్ల మంది వీక్షించారు. 10 లక్షల లైకులు రావడం విశేషం. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిపురుష్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు.
ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ గురించి మొదలైన చర్చ కొనసాగుతూనే ఉంది. కొందరు అద్భుతంగా ఉందని అంటే.. ఇంకొందరు మాత్రం దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తమిళ ప్రేక్షకులు అయితే కావాలనే ఈ టీజర్‌ను ట్రోల్ చేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమాను తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారనే కోపాన్ని ఆదిపురుష్ మీద చూపిస్తున్నారు. అయితే ఇక్కడి ప్రేక్షకులు సైతం ఆదిపురుష్ టీజర్ పట్ల అంతగా ఆనందాన్ని వ్యక్త పర్చడం లేదు. నాసిరకమైన వీఎఫ్‌ఎక్స్ పట్ల పెదవి విరుస్తున్నారు. అయితే ఆదిపురుష్ టీజర్‌లో ప్రభాస్ లుక్ పట్ల ఒరిజినాలిటీ మిస్ అయిందని, అంతా కూడా యానిమేషన్‌లా ఉందని అందరూ అంటున్నారు. ఇలాంటి చిత్రాలు తీయాలన్నా, వీఎఫ్‌ఎక్స్ వాడాలన్నా అది రాజమౌళి వల్లే సాధ్యమని అంటున్నారు. రాముడిగా ప్రభాస్‌ను చూపించిన తీరు మీద ఓం రౌత్‌ను జనాలు తిడుతున్నారు. వానర సైన్యమా? గాడ్జిల్లాలా? అంటూ ట్రోల్స్ వేస్తున్నారు.