Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తుంది. వరుసగా 5 విజయాలతో టాప్ గేర్ లో దూసుకెళ్తుంది SRH జట్టు. కేవలం మ్యాచ్‌ల్లో గెలుపులతోనే కాకుండా, వ్యక్తిగత అవార్డుల పరంగా కూడా SRH ఆధిపత్యం చాటుతోంది. ప్రస్తుతం ఆరంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసుల్లో టాప్ లో నిలిచారు.
బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 209.35 స్ట్రైక్ రేట్ తో 425 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు. అతనికి తోడుగా అభిమానులు ముద్దుగా కాటేరమ్మ కొడుకుగా పిలుచుకునే హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతను 414 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. SRH ఇన్నింగ్స్ లో మిడిల్ ఓవర్లలో జట్టుకు స్థిరత్వాన్ని అందిస్తూ భారీ స్కోర్లను అందిస్తున్నాడు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
మరోవైపు బౌలింగ్ విభాగంలో ఈషాన్ మలింగా (Eshan Malinga) అద్భుత ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ రేస్ లో మొదటి స్థానానికి దూసుకొచ్చాడు. 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి టాప్‌లో నిలిచాడు. అతని బౌలింగ్ SRH విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. డెత్ ఓవర్లలో అతని యార్కర్లు, వేరియేషన్స్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నాయి. అలాగే బౌలింగ్‌లో ఈషాన్ మలింగా తర్వాత భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్ లు కూడా వికెట్ల వేటలో దూసుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!