Sunny Leone: సన్నీ లియోనీ గురించి తెలియని వాళ్లు ఉండరు. బాలీవుడ్లో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. అయితే.. సన్నీ గతం గురించి చాలా మందిరకి తెలియదు. అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసిందనే కారణంతో ఆమెను జడ్జ్ చేసే వాళ్లు పెరిగిపోయారరు. ఎవ్వరు ఏమన్నా సన్నీని ఏమాత్రం ప్రభావితం చేయలేవు. ప్రస్తుతం భర్త డేనియల్ వెబర్, ముగ్గురు పిల్లలతో కలిసి సన్నీ హ్యాపీగా జీవిస్తోంది. తన జీవితాన్ని స్వేచ్ఛగా ఆస్వాదిస్తోంది. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సన్నీని బాధించే ఒక విషయం గురించి చెప్పింది. అందేంటో కాదు.. తన తల్లి మరణించిన నాటి రోజులను గుర్తు చేసుకుంది.
READ MORE: US: ‘‘డల్లాస్ పాకిస్తాన్లా కనిపిస్తోంది’’.. ఇస్లామీకరణపై యూఎస్ నేత ఆందోళన..
బాలీవుడ్ బబుల్‌తో మాట్లాడిన సన్నీ.. తన తల్లి బల్వంత్ కౌర్ వోహ్రా మరణించిన రోజును గుర్తు చేసుకుంది. ఈ విషయంలో సన్నీ పడిన బాధ కళ్లలో స్పష్టంగా కనిపించింది. “నేను ఆ రోజు ఇంటికి కొంచెం త్వరగా చేరి ఉంటే బాగుండేది. నేను ఇంటికి చేరేసరికి అమ్మ లేరు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ బాధ ఇప్పటికీ తన మనసులో అలాగే ఉందని చెప్పింది. “అందరూ ఇండియన్ తల్లిదండ్రులకూ ఇలాగే ఉంటారో లేదో తెలియదు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమ ఆరోగ్యం ఎంత సీరియస్‌గా ఉందో పిల్లలకు చెప్పరు. పరిస్థితి చాలా విషమంగా ఉన్నా కూడా, పిల్లలు ఆందోళన చెందకూడదని దాడి పెడతారని చెప్పింది. మా నాన్న మమ్మల్ని కాపాడాలని అనుకునేవారు. మాకు టెన్షన్ రాకూడదని చాలా విషయాలు మాతో పంచుకోలేదు. మేము సంతోషంగా ఉండాలని మాత్రమే ఆయన కోరుకునేవారు” అని చెప్పింది. తల్లి చనిపోయిన రోజు సన్నీ తన పని కోసం బయటకు వెళ్లింది. అంతా బాగానే ఉందనుకుని, పని పూర్తయ్యాక ఇంటికి వచ్చింది. కానీ ఇంటికి చేరినప్పటికే ఆమె తల్లి కన్నుమూసింది. ఆ చివరి క్షణాల్లో అమ్మ దగ్గర ఉండలేకపోయాననే బాధ తన జీవితంలో ఎప్పటికీ మిగిలిపోయిందని సన్నీ చెప్పింది. 2008లో ఈ ఘటన చోటు చేసుకుంది. సన్నీ లియోనీ తన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘కరణజీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ’ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఆ సిరీస్‌లో ఆమె బాల్యం నుంచి బాలీవుడ్‌కి వచ్చిన ప్రయాణం వరకూ అన్నీ చూపించింది. తన కుటుంబం, తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం కూడా అందులో చాలా భావోద్వేగంగా చూపించారు.
READ MORE: RAPO : రామ్ పోతినేని ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్