Sunishith : ఎప్పుడూ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో సాక్రిఫైయింగ్ స్టార్ గా పాపులరైన వ్యక్తి సునిశిత్. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చావు దెబ్బలు తిన్నాడు. నిత్యం ఏదో ఓ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సునిశిత్ తనని తాను హీరోగా చెప్పుకుంటాడు. తాను చేయాల్సిన అనేక సూపర్ డూపర్ సినిమాలను స్టార్ హీరోలు లాక్కున్నారంటాడు. హీరోలు వచ్చి తనని బ్రతిమిలాడితే వారికి ఇచ్చేశానంటాడు. ఇక హీరోయిన్స్ తో తనకు అఫైర్స్ ఉన్నాయని చెబుతాడు. కాజల్, తమన్నా అందరూ తన గర్ల్ ఫ్రెండ్సే అంటూ బిల్డప్ ఇస్తుంటాడు.
Read Also: Cabinet: కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. కిరణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్
ఆ మధ్య ఓ అడుగు ముందుకేసి లావణ్య త్రిపాఠితో అయితే ఏకంగా రహస్యంగా పెళ్లైందంటూ బాంబు పేల్చాడు. దీనిపై సీరియస్ అయిన లావణ్య కేసు పెట్టి జైల్లో పెట్టించింది. ఇటీవల చరణ్ వైఫ్ ఉపాసన మీద సునిశిత్ తీవ్ర ఆరోపణలు చేశారు. రామ్ చరణ్ నా ఫ్రెండ్. ఉపాసనను లైన్లో పెట్టమని నాకు చెప్పాడని అన్నాడు. ఉపాసనతో నేను గోవాకు డేట్ కి వెళ్లానన్నాడు. దీంతో ఆగ్రహించిన రామ్ చరణ్ ఫ్యాన్స్ తన నివాసానికి వెళ్లి పిచ్చ కొట్టుడు కొట్టారు. అనంతరం ఉపాసన గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పించారు. వీరబాదుడు బాదినంక ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చారు. వాటిని సునిశిత్ తీసుకున్నారు. ఉపాసనతో డేట్ కి వెళ్లానని సునిశిత్ చెప్పిన మాటలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. నిజమా అన్నా అంటూ చరణ్ ని ఎద్దేవా చేస్తున్నారు.
Read Also: Mrunal Thakur: బాబోయ్ మృణాల్ ఇలా రెచ్చిపోతే మా పరిస్థితి ఏంటి
దీనికి కౌంటర్ గా చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గురించి సునిశిత్ చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో వైరల్ చేస్తున్నారు. సునిశిత్ ఓ ఇంటర్వ్యూలో… ఎన్టీఆర్ ఇంత పెద్ద హీరో కానీ అతడు నీలి చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్ వి నీలి చిత్రాలు ఉన్నాయి. ఇది సునిశిత్ కి మాత్రమే తెలిసిన నిజం అంటూ చెప్పుకొచ్చాడు. సునిశిత్ వ్యాఖ్యలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సునిశిత్ కు మానసిక రోగం ఉందని.. అందువల్లే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు.