Mumbai Indians missing gamechanger Suryakumar Yadav: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ రాత ఇంకా మారలేదు. హోమ్ గ్రౌండ్‌లో ఆడినా కలిసి రాలేదు. సోమవారం వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని చవిచూసిన ముంబై.. హ్యాట్రిక్ ఓటమిని ఖాతాలో వేసుకుంది. బ్యాటర్లు, బౌలర్లు విఫలమవడంతో ముంబైకి వరుస పరాజయాలు తప్పడం లేదు. ముంబై బ్యాటింగ్ గురించి టీమిండియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ముంబై ‘గేమ్ ఛేంజర్’ని మిస్ అయిందని పేర్కొన్నాడు.
స్టార్ స్పోర్ట్స్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ గేమ్ ఛేంజర్ సూర్యకుమార్ యాదవ్‌ని మిస్ అవుతోందని పేర్కొన్నాడు. ‘ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్‌ను మిస్ అవుతోంది. సూర్యకుమార్ నెం.3లో బ్యాటింగ్‌కు దిగి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేయగలడు. కానీ అతను ప్రస్తుతం అందుబాటులో లేడు. సూర్య త్వరగా జట్టుతో చేరాలని ముంబై ప్రార్థిస్తుంటుంది. ఎందుకంటే.. అతడు గేమ్ ఛేంజర్. సూర్య మ్యాచ్‌ను నిమిషాల్లో మార్చేయగలడు’ అని సన్నీ చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం సూర్యకుమార్ యాదవ్ క్రికెట్‌కు దూరమయ్యాడు. విదేశాల్లో గాయానికి సర్జరీ చేసుకున్నాడు. సర్జరీ అనంతరం వేగంగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు. అయితే ఐపీఎల్ 2024లో ఆడేందుకు ఎన్‌సీఏ అనుమతి ఇవ్వలేదు. ఎన్‌సీఏ గ్రీన్ సిగ్నల్ కోసం సూర్య ఎదురుచూస్తున్నాడు. సూర్యకుమార్ ఇప్పటివరకు 139 ఐపీఎల్ మ్యాచులు ఆడి 3249 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.