బుల్లితెరపై లెజండరి యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాప్ యాంకర్ గా ఇప్పటికి ఇండస్ట్రీలో అదే క్రేజ్ ను మైంటైన్ చేస్తుంది.. సుమ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.. మీడియాపై ఓ ప్రెస్ మీట్‌లో చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. ఫుడ్‌పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి… దీనిపై స్పందించిన సుమ మీడియా వారిని క్షమాపణలు కోరింది.. దాంతో గొడవ సర్దుమణిగింది.. తాజాగా మరో వీడియోతో ట్రెండ్ అవుతుంది..
ఆ వీడియోలో సుమ ఏదో షూట్ కోసం మేకప్ రూమ్ లో రెడీ అవుతుంది.. ఇందులో ఆమె ముందుగా మేకప్ లేకుండా కనిపించింది. అయితే తన ల్యాప్ టాప్‌ని ఓపెన్ చేయాలనుకుంది. ఫేస్ స్కానింగ్ పాస్ వర్డ్ ని పెట్టుకుంది. మేకప్ లేకపోవడంతో ల్యాప్ ట్యాప్ గుర్తించలేదు. లాక్ ఓపెన్ కాలేదు. దీంతో ఆశ్చర్యపోయిన సుమ.. మేకప్ వేసుకున్నాక ల్యాప్ ట్యాప్ ముందు ఫేస్ పెట్టింది.. అంతే అది ఓపెన్ అయ్యింది.. సుమ షాక్ లో ఉండిపోయింది..
ఇకపోతే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ రచ్చ చేస్తున్నారు. మేకప్ లేకపోతే మేమే గుర్తు పట్టలేం, ఇంకా ల్యాప్ ట్యాప్ ఏం గుర్తుపడుతుందని, అర్థరాత్రి అర్జెంట్‌గా ల్యాప్ ట్యాప్ ఓపెన్ చేయాల్సి వస్తే పరిస్థితేంటండి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. సుమక్కతో పెట్టుకుంటే అట్లుంటదని కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు.. ఇక సుమ ఓ వైపు టీవీ షోస్, మరో వైపు సినిమా ఈవెంట్లు చేస్తుంది. ఒకప్పుడు టీవీ షోస్‌తో బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఒకటి రెండు షోస్ మాత్రమే చేస్తుంది. `సుమ అడ్డా`కి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు అప్పుడప్పుడు స్పెషల్ ఎపిసోడ్‌లు, టాక్ షోలు చేస్తుంది. అలాగే సినిమా ప్రెస్‌మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..