West Bengal: బాణాసంచా పేలుడుపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరిపించాలి.. అమిత్ షాకు లేఖ
పశ్చిమ బెంగాల్‌లోని దుత్తాపుకూర్‌లో ఆదివారం ఉదయం బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ ప్రమాదంపై NIA తో విచారణ జరిపించాలని అందులో కోరారు. ఈ ప్రమాదంపై తాను తీవ్ర ఆందోళనతో, బరువెక్కిన హృదయంతో లేఖ రాస్తున్నానని మజుందార్ తెలిపారు. ఈ ప్రమాద ఘటన భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. దీనిపై సమగ్ర, న్యాయమైన దర్యాప్తు తప్పనిసరి చేయించాలని.. విషాద సంఘటనల వెనుక కారణాలను తెలుసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
Read Also: Allu Arjun: ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు.. బన్నీ ఏమన్నాడంటే..?
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ఈ పేలుడు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని.. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. ఈ సంఘటన చాలా ఆందోళన కలిగిస్తుందని.. ఈ అక్రమ ఫ్యాక్టరీల గురించి స్థానిక నివాసితులు పోలీసులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, వాటిపై దృష్టి పెట్టలేదన్నారు. తాను సమగ్ర, వివరణాత్మక దర్యాప్తును నిర్వహించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)ని అభ్యర్థిస్తున్నానని తెలిపారు. ఈ పేలుళ్లకు సంబంధించి ఏదైనా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన అవకాశంతో సహా అన్ని కోణాల్లో నిష్పక్షపాత దర్యాప్తును ఆదేశించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని మజుందార్ పేర్కొన్నారు.
Read Also: India Vs Pakistan: పాకిస్తాన్ ఇక మీకుంది చూడు.. కోహ్లీ మీ భరతం పడతాడు..!
అంతకుముందు.. ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ, “ఈ ఫ్యాక్టరీ మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అక్రమ ఫ్యాక్టరీలను మూసివేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద మాటలు చెప్పారని.. కానీ వారు దొంగలను రక్షించడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ఇమామ్‌లతో సమావేశాలు నిర్వహించడం.. మతతత్వ కార్డును ప్లే చేయడమే వారి పని అని ఆయన దుయ్యబట్టారు.
My letter to Hon’ble HM Shri @AmitShah ji for urgent request for NIA investigation into recent explosions in Duttapukur. pic.twitter.com/hIjt0Td83w
— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) August 27, 2023
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!