Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే..
- దివి శివరాం యాక్టివ్ అవడంతో వార్ ఓపెన్..
- ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై బహిరంగంగా అసంతృప్తి..
- ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నవారితో వరుస సమావేశాలు..
- అభివృద్ధి అంతా నేనే చేశానని ఎమ్మెల్యే చెప్పుకోవడంపై అభ్యంతరం..
- నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళంటూ ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు..
- పార్టీలో ప్రాధాన్యంలేని వారితో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్..
- దివి శివరామ్ అసలు టార్గెట్ వేరే ఉందా?..
- ఈసారి తమ్ముడు రవీంద్రనాథ్ని బరిలో దింపాలనుకుంటున్నారా?...
- రెండు వర్గాలు పరస్పరం చెక్ పెట్టుకునే ప్రయత్నాలతో పొలిటికల్ హీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఎప్పుడూ కూల్‌గా కనిపించే కందుకూరు నియోజకవర్గం టీడీపీలో ఇప్పుడు రెండు పవర్ సెంటర్స్ తయారయ్యాయి. సొంత పార్టీలోనే దీని గురించి హాట్ హాట్‌గా మాట్లాడుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఓవైపు.. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మరోవైపు అన్నట్టుగా మారిపోయిందట. ఇద్దరి మధ్య ఎన్నికలకు ముందు మొదలైన విభేదాలు…కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త సద్దుమణిగినట్టు కనిపించాయి. కానీ ఇటీవల దివి శివరాం యాక్టివ్ కావడంతో…గ్రూప్ వార్ ఓపెన్ అయినట్టే కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అభివృద్ధి క్రెడిట్.. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత.. కార్యకర్తలకు గుర్తింపు వంటి అంశాలపై ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే… ఇప్పుడు సడన్‌గా గేర్ మార్చటం.. బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఆసక్తి రేపుతోంది. ఇది కేవలం విమర్శలతో ఆగిపోకుండా.. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు, కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కొంత కాలంగా పార్టీలో ప్రాధాన్యత కోల్పోయామని భావిస్తున్న దివి శివరాం శిబిరం వరుస సమావేశాలు నిర్వహిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అటు ఇటీవల మాజీ ఎమ్మెల్యే… సిట్టింగ్ శాసనసభ్యుడి మీద నేరుగా చేసిన కామెంట్స్ నియోజకవర్గంలో పెద్ద దుమారమే రేపాయి. కందుకూరులో కనిపిస్తున్న అభివృద్ధంతా తానే చేశానంటూ ఎమ్మెల్యే ఇంటూరి చెప్పుకోవడంపై శివరాం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా తన తండ్రి దివి కొండయ్యచౌదరి, మానుగుంట ఆదినారాయణరెడ్డి, మహీధర్ రెడ్డి, తాను నిరంతరాయంగా చేసిన అభివృద్ధే ఇప్పుడు కనిపిస్తోందని చెప్పుకొచ్చారాయన. అదంతా వదిలేసి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్లు క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకుంటామంటే ఎలా.. అంటూ ఓపెన్‌గానే ఫైర్ అయ్యారు శివరాం.
అక్కడితో ఆగకుండా గంజాయి విక్రయాలపై పోలీస్ బాసులకు ఫిర్యాదు చేస్తాననడం, ఎమ్మెల్యే వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేయడం చర్చనీయంశమైంది. మరోవైపు పార్టీ పవర్లోకి వచ్చినా తమకు సరైన గుర్తింపు లేదన్నది చాలామంది తమ్ముళ్ల అసంతృప్తి. కాంట్రాక్టులు, పదవుల్లో ప్రాధాన్యత దక్కక.. ఎమ్మెల్యే వ్యవహారశైలి నచ్చక దూరంగా ఉంటున్న వాళ్ళని ఇప్పుడు తనవైపు తిప్పుకునేందుకు దివి శివరాం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత లేని నాయకుల కోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయటం, ఇబ్బందుల్లో ఉన్నవారంతా రండి.. అందరం కలిసి అధిష్టానం దగ్గరకు వెళ్లి మన బాధలు చెప్పుకుందామని పిలుపునివ్వడం ఆసక్తిగా మారింది. దివి శివరాం ఉన్నట్టుండి ఇంతలా స్పీడ్ పెంచడం వెనుక కేవలం అసంతృప్తి ఒక్కటే కారణం కాదని, వచ్చే ఎన్నికల్లో ఇంటూరి నాగేశ్వరరావుకు టికెట్ దక్కకుండా చెక్ పెట్టే లక్ష్యం ఉందని చెప్పుకుంటున్నారు. తన సోదరుడు దివి రవీంద్రనాథ్ను లైన్లోకి తెచ్చేందుకు శివరాం తెరవెనుక కథ నడుపుతున్నారన్నది స్పెషల్ అనాలిసిస్. కందుకూరులో రవీంద్రనాథ్ సొంత ఇల్లు నిర్మించుకోవడం, ఇక్కడే ఉంటానని ప్రకటించడం.. నియోజకవర్గంలో జరిగే ప్రతి శుభకార్యానికి, సామాజిక కార్యక్రమాలకు శివరాం హాజరవుతూ తన సోదరుడిని వెంటబెట్టుకుని వెళ్లడం ఇందులో భాగమేనని అంటున్నారు. నియోజకవర్గంలో తిరిగి తమ కుటుంబ పట్టును ఎలాగైనా నిలబెట్టుకోవాలన్నదే ఆయన ఆలోచనగా తెలుస్తోంది.
Also Read
అటు ఈ వ్యవహారాలను ఇంటూరి వర్గం కూడా ఆషామాషీగా తీసుకోవడం లేదట. శివరామ్‌కు ఎక్కడిక్కడ చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో విభేదాలు సృష్టిస్తూ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా శివరాం వ్యవహరిస్తున్నారంటూ అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపుతున్నారని సమాచారం. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వర్గం డిమాండ్ చేయడం ఇంట్రస్టింగ్ పాయింట్. ఓవైపు జూనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇంటూరి తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు నియోజకవర్గంలో పాత కాపులందర్నీ ఏకం చేసేందుకు సీనియర్ మాజీ ఎమ్మెల్యే శివరాం వేస్తున్న ట్రయల్స్ కందుకూరు టీడీపీలో హీట్ పెంచుతున్నాయి. ఈ వార్‌లో అధిష్టానం ఏం చేస్తుందో చూడాలంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..