పశ్చిమ బెంగాల్‌లోని దుత్తాపుకూర్‌లో ఆదివారం ఉదయం బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.