ప్రతి నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని వీడియోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఈ నేపధ్యంలో అనేక సంఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం చూస్తూనే ఉంటాము. తాజాగా ఓ వ్యక్తి ముంబై నగరంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
World Cup 2024: విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ప్రశంసలు..ఏమన్నారంటే?
ముంబై మహానగరంలో ఓ విచిత్ర సంఘటన నేడు చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ముంబై నగరంలోని మంత్రాలయ బిల్డింగ్ పైనుంచి దూకడానికి ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఎలాంటి చిన్న గాయం కాకుండానే బయటపడ్డాడు. ఈ సంఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆఫీసులలో ఒకటైన మంత్రాలయ భవనం పై నుండి గురువారం నాడు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు.
David Warner: ఏమైంది డేవిడ్ భాయ్.. అసలెలా పొరపాటుపడ్డావ్..
అయితే అనుకోకుండా అతడు పడిన ప్రదేశంలో సేఫ్టీ నెట్ ఉండడంతో అతడు దానిపై పడడంతో అతనికి ఏ హాని కాలేదు. దింతో అతడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ బిల్డింగ్ రెస్క్యూ సిబ్బంది వెంటనే చేరుకొని అతనిని రక్షించింది.
#WATCH | Man jumps from the upper floor of the Mantralaya (the administrative headquarters of Maharashtra govt in Mumbai), lands in safety net installed in the building; police reached the spot to rescue the man. Further details awaited
(Visuals confirmed by police) pic.twitter.com/MIhZiDH4hY
— ANI (@ANI) June 6, 2024