Suhas Comments at Prasannavadanam Movie Teaser launch: యంగ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వైకె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలయి చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ రోజు మేకర్స్ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో ఒక ప్రశ్న అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఒక జర్నలిస్ట్ సుహాస్ ను మీరు యూట్యూబ్ నుంచి కెరీర్ మొదలు పెట్టారు, అంటే ఇప్పుడు ఆల్ మోస్ట్ ఒక ప్రామిసింగ్ హీరో, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు, మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యేవాళ్ళకి మీరిచ్చే సందేశం ఏమిటి అని ప్రశ్నించారు.
RGV: ఓటీటీలో ‘వ్యూహం, శపథం’.. మా అసలు వ్యూహం ఇదే.. వర్మ షాకింగ్ ప్రకటన
కొందరున్నారు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి రియాలిటీ షోలకి వెళ్లి హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నా అవి వర్కౌట్ కావడం లేదు. వాళ్లు మైక్ ముందుకు వచ్చి నా సినిమా ఎందుకు చూడడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి, అయినా సక్సెస్ అవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకి మీరేం చెబుతారు? అని ప్రశ్నించారు. దానికి సుహాస్ మాట్లాడుతూ సారీ అండి, నా బతుకేంటో నాకు అర్థం కావడం లేదు.. నీ ఫ్యూచర్ ఎవడికి కావాలి? అనే ఫేమస్ డైలాగ్ ని రిపీట్ చేశాడు. నేను చేసే సినిమాలు మీకు నచ్చుతున్నాయి కదాఅని ప్రశ్నించారు. ఇక నేను హీరో అవుతానని అనుకోలేదు, ఈరోజుకి కూడా నేను హీరో అంటే కొత్తగా ఉంటుంది. నేను ఎప్పుడూ ఒకటే చెబుతా షార్ట్ ఫిలిమ్స్ లో టాలెంట్ చూపిస్తే సినిమా వాళ్ళు పిలుస్తారు, నన్ను అలాగే పిలిచారు. నేను చేసే సినిమాల్లో పాత్రలకి కూడా అలాగే పిలిపిస్తున్నా అని అన్నారు.