ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా చావు కబుర్లు వినాల్సి వస్తోంది. చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. ఇంతక ముందు ఇలాంటి వార్తలు ఎప్పుడూ కానరాలేదు. కానీ ఈ మధ్య అన్ని ఇలాంటి వార్తలే వినాల్సి వస్తోంది. చిన్న వయసులోనే గుండెపోటులు రావడమేంటో అర్థం కావడం లేదు. హఠాత్తు మరణాలు కన్నపేగుకు కడుపుకోత మిగిలిస్తున్నాయి. పట్టుమని పదేళ్లు కూడా లేవు. కానీ ఓ విద్యార్థి స్కూల్ ఆవరణలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ ఘోర విషాదం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది.
ఫిరోజాబాద్‌లో (Firozabad) హన్స్ వాహిని పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులంతా సంతోషంగా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు. అంతే ఉన్నట్టుండి రెండో తరగతి చదువుతున్న చంద్రకాంత్ (8) అనే బాలుడు కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటన పాఠశాలలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
చంద్రకాంత్ పరిగెత్తుతుండగా అకస్మాత్తుగా పడిపోయాడు.. సహా విద్యార్థులు లేపే ప్రయత్నం చేసినా లేవలేదు. స్కూల్ టీచర్లు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతని మరణానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. గుండెపోటుగా (Heart attack) తెలుస్తోంది. చిన్నారి ఆకస్మిక మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరు విలపించారు.
ఇదిలా ఉంటే వీడియో చూస్తుంటే.. సమయం మిట్ట మధ్యాహ్నం కావడం.. పైగా వేసవి కాలం. సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఆ సమయంలో చిన్న పిల్లలంతా ఆడుకుంటున్నారు. వడదెబ్బ తగిలి స్పృప తప్పిపడిపోయినట్లుగా విజువల్స్‌లో స్పష్టంగా కనబడుతుంది. వాస్తవానికి ఆ సమయంలో విద్యార్థులను ఆడుకోనివ్వకూడదు. కానీ భగభగమండే ఎండలో ఆడుకోవడంతో ఎండ వేడిమికి స్పృహ కోల్పోయాడు. చిన్న వయసులో తల్లికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోయాడు. ఇకనైనా మధ్యాహ్న సమయాల్లో పిల్లల్ని ఎండల్లో ఆడనివ్వకుండా చూస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు.
#Shocking : Class second student dies of heart attack in Firozabad.#Firozabad #heartattack #UttarPradesh pic.twitter.com/BXfZeiZNTL
— upuknews (@upuknews1) March 9, 2024