మలేషియాలో ఓ విచిత్రమై ఘటన జరిగింది. 22 ఏళ్ల వ్యక్తికి 48 ఏళ్ల టీచర్‌కి పెళ్లి జరిగింది. వీరి ప్రేమ కథేంటో తెలిస్తే మీరు తప్పకుండ ఆశ్చర్యపోతారు. మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ వయస్సు 22 సంవత్సరాలు. అతని క్లాస్ టీచర్ జమీలాకి 48 ఏళ్లు.. 2016లో అతను తను చదువుకున్న స్కూల్‌కి వెళ్లినపుడు క్లాస్ రూంలో ఆమెను కలిశాడు. తను చివరిసారిగా జమీలాను 4వ తరగతిలో ఉండగా చూసాడు. తనని గుర్తు చేస్తూ జమీలాను పలకరించాడు. దీంతో ఇద్దరు ఫోన్ నెంబర్స్ మార్చుకున్నారు.
Also Read : Minister KTR : లండన్‌లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్
దీంతో మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ పుట్టినరోజుకి జమీలా ఫోన్‌లో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ చేసింది. మొహమ్మద్ ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆ విషయాన్ని ఆమెకు కూడా చెప్పేశాడు. వారిద్దరి మధ్య ఉన్న 26 సంవత్సరాల వయసు బేధం కారణంగా జమీలా అతడిని తొలుత రిజెక్ట్ చేసింది. అహ్మద్ అలీ ఆమె ఇంటి అడ్రస్ కనుక్కున్నాడు. మాటలు కలిసి నెమ్మదిగా వారి మధ్య పెరిగిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
Also Read : Pawan Kalyan : కాకినాడలో రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
చివరికి జమీలా మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ ప్రేమను అంగీకరించింది. 2019లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కోవిడ్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. 2021లో మొత్తానికి ఈ జంట ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్యలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. జమీలాకి 2007లో మొదటి భర్తతో విడాకులయ్యాయి. ప్రస్తుతం అహ్మద్ అలీ వాటర్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నాడు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే అని.. 26 సంవత్సరాల వయసు తేడా తమ ప్రేమకు అడ్డంకి మారలేదని ఈ జంటచెబుతుంది. వినడానికి వెరైటీగా అనిపిస్తున్నా ఈ ప్రేమ కథ మాత్రం వాస్తవం.