చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో.. గురువులు మందలించారనో.. ప్రేమ విఫలమైందనో ఇలా పులు కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్షణికావేశానికి లోనై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు చనిపోయాక.. కన్న తల్లిదండ్రు అనుభవించే ఆవేదనను ఒక్కసారి కూడా గుర్తు చేసుకోవడం లేదు. తాజాగా వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి ట్రిబుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
READ MORE: Vinesh Phogat-Gold Medal: గోల్డ్ మెడల్ తీసుకువస్తా.. మాటిచ్చిన వినేశ్ ఫొగాట్!
వేంపల్లి ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం చోటుచేసుకుంది. బాత్రూంలో వాటర్ లైన్ పైపుకు చున్నీతో ఉరి వేసుకుని ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జమీషా ఖురేషి గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఫైనల్ ఇయర్ కు చెందిన ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ క్యాంటీన్ వద్ద పోయింది. మిస్ అయిన మొబైల్ ఫోన్ ను జమీషా ఖురేషి తీసుకున్న విషయాన్ని గుర్తించి ట్రిబుల్ ఐటీ అధికారులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలులోస్తున్నాయి.