Vinesh Phogat-Gold Medal: గోల్డ్ మెడల్ తీసుకువస్తా.. మాటిచ్చిన వినేశ్ ఫొగాట్!
- సెమీస్‌లో వినేశ్ విజయం
- తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర
- గోల్డ్ మెడల్ తీసుకువస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinesh Phogat promises to bring Gold Medal For India: ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో మంగళవారం జరిగిన సెమీస్‌లో 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపేజ్‌ను వినేశ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన వినేష్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ గెలుపుతో వినేష్ కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.
మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో టోక్యో కాంస్య విజేత, అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌తో వినేశ్ ఫొగాట్ తలపడుతుంది. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 11.23 గంటలకు జరగనుంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా వినేశ్ బరిలోకి దిగుతోంది. గోల్డ్ మెడల్ తీసుకువస్తా అని వినేశ్ తన తల్లికి మాట ఇచ్చింది. సెమీస్ విజయం తర్వాత వినేష్ వీడియో కాల్‌లో తన తల్లితో మాట్లాడారు. ఈ సమయంలో వినేష్ తన కుటుంబ సభ్యులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. భావోద్వేగానికి గురైంది. వీడియో చివర్లో ‘గోల్డ్ లానా హై’ (నేను బంగారం తెస్తా) అని తన తల్లితో అన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
Also Read: IND vs GER: సెమీఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓటమి.. కాంస్యం కోసం భారత్ పోరు!
పలు కారణాలతో దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన వినేశ్ ఫొగాట్.. పెద్దగా అంచనాల్లేకుండా పారిస్ ఒలింపిక్స్ బరిలో దిగింది. వరల్డ్ నెంబర్ వన్ యుయ్ సుసాకీ (జపాన్) వినేశ్ తొలి మ్యాచ్ కావడంతో వినేశ్ గెలుస్తుందా అని అందరూ అనుకున్నారు. చివరి 9 సెకన్లే ఉందనగా రింగ్ బయటకు ప్రత్యర్థిని తోసేసి 3-2తో అనూహ్య విజయం సాధించింది. క్వార్టర్స్‌లో 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య విజేత లివాచ్‌ను 7-5తో వినేశ్ ఓడించింది. అదే జోరులో సెమీస్‌లో 5-0 తేడాతో గుజ్మన్ లోపేజ్‌ను మట్టికరిపించింది. ఇక పసిడి పోరుకు సిద్దమైంది.
It takes a village – Vinesh PHOGAT 🇮🇳 talking to her mother after becoming the first Indian to reach Olympic final in women’s wrestling#uww #wrestling #wrestleparis #olympics #paris2024 pic.twitter.com/Kh5SDCVR3T
— United World Wrestling (@wrestling) August 6, 2024
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!