Stock Market: కొనసాగుతున్న కొత్త జోష్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock

Stock

స్టాక్ మార్కెట్లలో వరుస జోరు కొనసాగుతోంది. బుధవారం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు.. గురువారం కూడా అదే జోష్ కొనసాగించింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 785 పాయింట్లు లాభపడి 75, 168 దగ్గర ముగియగా.. నిఫ్టీ 231 పాయింట్ల లాభపడి 22, 851 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Parking Car: పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ..

×
×
Ad

ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, ఐటీ, రియాల్టీ 3-5 శాతం వృద్ధి సాధించగా.. ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో కొనసాగాయి.

ఇది కూడా చదవండి: BJP: సీట్లు తగ్గినా లొంగిపోయేందుకు సిద్ధంగా లేని బీజేపీ..