Parking Car: పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 34 ఏళ్ల వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైనట్లు అధికారి ఒకరు తెలిపారు. కారులోనే నిప్పంటించుకోవడానికి ప్రయత్నించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. వాహనంలో మంటలు చెలరేగకపోవడంతో అతనికి హైపోక్సియా ఒత్తిడి కారణంగా ముక్కు నుండి రక్తస్రావం అయ్యి ఊపిరాడక చనిపోయాడని వివరాలు తెలిపారు. మృతుడు లజ్‌పత్ నగర్ ప్రాంతంలోని దయానంద్ కాలనీకి చెందిన ధ్రువ్ మహాజన్‌గా అధికారులు గుర్తించారు.
Delhi: శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. తాజా పరిణామాలపై చర్చ
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ఈ కేసు సంబంధించి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ డియో మాట్లాడుతూ.., గురువారం ఉదయం 9:40 గంటలకు విషయం పోలీసు కంట్రోల్ రూమ్ (పిసిఆర్)కి అందింది. ఒక పార్క్ చేసిన కారులో మృతదేహం, దాని చుట్టూ రక్తం చిమ్ముతూ లోపల పడి ఉందని తెలిపారు. నెహ్రూ ప్లేస్‌లోని దేవికా టవర్ పక్కన పహద్‌పూర్ బిజినెస్ సెంటర్ ముందు ఉన్న సంఘటనా స్థలానికి చేరుకోగా, డ్రైవర్ సీటుపై రక్తంతో మృతదేహం కనిపించింది.
కారు అన్ని వాకిళ్లు లాక్ చేయబడి ఉన్నందున, వెనుక అద్దాలు పగలగొట్టి కారు తెరవగా., ముఖం, తొడ, రెండు చేతులపై కాలిన గాయాలతో వ్యక్తి స్టీరింగ్ వీల్‌పై చనిపోయినట్లు గుర్తించబడిందని తెలిపారు. కారులోపల పెట్రోలు వాసన వస్తోందని, మృతుడి వెంట్రుకలు పూర్తిగా పాడైపోయాయని, స్టీరింగ్ పాక్షికంగా కాలిపోయిందని.. టీషర్టులో మసి ఉందని డీసీపీ తెలిపారు. ముందు సీటులో వాడిన వాటర్ బాటిల్, ఉపయోగించిన అగ్గిపుల్లలు కూడా ఉన్నాయని., ఆ తర్వాత ఏరియా సిసిటివిని యాక్సెస్ చేయగా, మృతుడు తెల్లవారుజామున 3:30 గంటలకు తన కారులో సంఘటనా స్థలానికి వచ్చినట్లు నిర్దారణ అయ్యింది. ఏడు నిమిషాల తరువాత, కారులో భారీ మంటలు రాగా., ఆ తరువాత ఒక నిమిషం తర్వాత తగ్గిపోయిందని చెప్పారు.
Navdeep: 23 ఏళ్లలో రకరకాల మనుషులను ప్రేమించా.. అలాంటి అమ్మాయే కావాలి: నవదీప్ ఇంటర్వ్యూ
ధ్రువ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని, ఆ తర్వాత మృతుడు హైపోక్సియా ఒత్తిడి కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం అయ్యి, ఊపిరాడక మృతి చెందాడని డీసీపీ తెలిపారు. విచారణలో, బెంగళూరులో నివసిస్తున్న మృతుడి సోదరి పూర్వి మహాజన్, ధ్రువ్ భారీ అప్పుల్లో ఉన్నాడని తెలియజేసింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి విచారణ ప్రక్రియను చేపట్టారు.
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!