ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సెంచరీల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతను నాలుగు సెంచరీలు సాధించాడు. గత 8 ప్రొఫెషనల్ మ్యాచ్‌లను కూడా కలుపుకుంటే అతను మొత్తం 5 సెంచరీలు సాధించాడు. వాటిలో ఒకటి టీ20 లీగ్‌లో జరిగింది. తాజాగా.. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ సాధించి అనేక రికార్డులు సాధించాడు. స్టీవ్ స్మిత్ 191 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది అతని టెస్ట్ క్రికెట్‌లో 36వ సెంచరీ. కెప్టెన్‌గా అతని 17వ సెంచరీ.. అలాగే ఆసియాలో అతని 7వ సెంచరీ. మరోవైపు.. స్టీవ్ స్మిత్ 10,000 పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అత్యధిక సగటుతో 10,000 పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ విభాగంలో స్మిత్.. కుమార్ సంగక్కరని మాత్రమే అధిగమించాడు. జాక్వెస్ కాలిస్, సచిన్ టెండూల్కర్ స్మిత్ వెనుక ఉన్నారు.
Read Also: Delhi Elections: కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసు.. విచారణకు హాజరుకావాలని పిలుపు
మరోవైపు.. ఆసియాలో ఆస్ట్రేలియా తరపున అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు స్టీవ్ స్మిత్ పేరు మీద ఉంది. అతను ఆసియాలో 7 సెంచరీలు సాధించి అల్లన్ బోర్డర్‌ను అధిగమించాడు. బోర్డర్ 6 సెంచరీలు సాధించగా.. స్మిత్ 7 సెంచరీలు సాధించాడు. అంతకుముందు.. తిరిగి ఫార్మ్‌లోకి వచ్చిన స్మిత్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మెల్బోర్న్‌లో కూడా సెంచరీ సాధించాడు. అనంతరం బిగ్ బాష్ లీగ్‌లో 121 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా.. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 141 పరుగులు చేసి.. సెంచరీ సాధించాడు.
Read Also: ICC Champions Trophy-2025: ఛాంపియన్స్ ట్రోఫీ థీమ్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)
ఆస్ట్రేలియా తరపున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మన్‌గా స్టీవ్ స్మిత్ నిలిచాడు. ఇది స్మిత్ టెస్ట్ కెరీర్‌లో 36వ సెంచరీ. స్మిత్ కంటే ముందు.. రికీ పాంటింగ్ 168 మ్యాచ్‌లలో 41 సెంచరీలు సాధించాడు. స్టీవ్ స్మిత్ 116 మ్యాచ్‌లలో ఇప్పటివరకు 36 సెంచరీలు చేశాడు. స్మిత్ ఇంకా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉన్నందున.. పాంటింగ్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్‌ను స్మిత్ సమం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ద్రవిడ్, రూట్ ఇద్దరూ 36 సెంచరీలు సాధించారు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో ఐదవ స్థానంలో స్మిత్, ద్రవిడ్, రూట్ ఉన్నారు. ప్రస్తుతం స్మిత్.. ద్రవిడ్, రూట్‌లను అధిగమించాలని చూస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడితే స్మిత్ సెంచరీ సాధిస్తే.. అతను ఈ రెండు రికార్డులను అధిగమించగలడు.