టూ వీలర్ వాహనదారులు భద్రత కోసం హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ప్రమాదాల్లో ప్రాణాలు రక్షించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మార్కెట్ లో నాణ్యతలేని హెల్మెట్స్ తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటిని కొనేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీని వల్ల డబ్బు సేవ్ అవుతుందని భావిస్తారే తప్ప ప్రాణాలను రిస్కులో పెట్టుకుంటున్నామన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్స్ ను యూజ్ చేయాలని సూచిస్తున్నాయి. మరి మీరు కూడా సేఫ్టీ కోసం బడ్జెట్ ధరలో మంచి హెల్మెట్ కోసం చూస్తున్నారా? అయితే హెల్మెట్ తయారీదారు స్టీల్‌బర్డ్ ద్విచక్ర వాహనదారుల కోసం కొత్త స్టీల్‌బర్డ్ టోర్నడో హెల్మెట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది హాఫ్ ఫేస్ హెల్మెట్.
ప్రత్యేకత ఏమిటి?
ఈ హెల్మెట్ లోపలి భాగంలో ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కాంతిని తగ్గించే సన్‌షీల్డ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఎక్కువ సమయం పాటు స్పష్టతను కాపాడుకునే పాలికార్బోనేట్ యాంటీ-స్క్రాచ్ వైజర్‌ను కలిగి ఉంటుంది. లోపలి భాగం గాలి చొరబడని, మల్టీ హోల్ ఇటాలియన్ డిజైన్‌తో వస్తుంది. స్టీల్‌బర్డ్ నుంచి వచ్చిన కొత్త హెల్మెట్ హై-ఇంపాక్ట్ ABS షెల్, మల్టీ-లేయర్ హై డెన్సిటీ EPS థర్మోకోల్‌తో రూపొందించారు. ఇది మెరుగైన ఇంపాక్ట్ శోషణ కోసం ఫైబర్‌గ్లాస్ రీన్‌ఫోర్స్‌మెంట్‌ను కూడా కలిగి ఉంది. దాదాపు అన్ని DOT-సర్టిఫైడ్ స్టీల్‌బర్డ్ హెల్మెట్‌ల మాదిరిగానే, టోర్నాడో కూడా కఠినమైన DOT భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఫైబర్‌గ్లాస్‌తో తయారు చేశారు.
ధర ఎంత?
స్టీల్‌బర్డ్ టోర్నాడో భారత మార్కెట్లో రూ. 1959 ధరకు విడుదలైంది. ఈ హెల్మెట్‌ను M (580mm), L (600mm), XL (620mm) పరిమాణాలలో కొనుగోలు చేయవచ్చు.