కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా.. కడుపు నొప్పి చికిత్స కోసం హాస్పిటల్ కు పోతే ఏకంగా కిడ్నీనే తొలగించారు అక్కడి ఘనులు. థానాలోని కొత్వాలో ఉన్న న్యూ లైఫ్ కేర్ హాస్పిటల్లో కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం వెళ్లిన రోగి కిడ్నీని తొలగించిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఎస్పీ సూచనల మేరకు పోలీసులు ఆపరేటర్‌తో సహా ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత సోమవారం బాధితురాలు ఎస్పీ సంతోష్ మిశ్రాను కలిసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read:Young Directors : హిట్ ఇచ్చినా కూడా ఖాళీగా ఉన్న యువ దర్శకులు
సీఓ ఖడ్డా బసంత్ కుమార్ సింగ్, SHO దీపక్ సింగ్ ఆసుపత్రికి చేరుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. రాంపూర్ ఖుర్ద్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయ్ తోలాకు చెందిన 35 ఏళ్ల అలావుద్దీన్ కడుపు నొప్పిగా ఉందని తెలిపాడు. 2025 ఏప్రిల్ 14న, అతను చికిత్స కోసం న్యూ లైఫ్ కేర్ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ ఆపరేటర్లు ఇమాముద్దీన్, తార్ మొహమ్మద్ కిడ్నీ స్టోన్ కు తక్షణ శస్త్రచికిత్స చేస్తామని చెప్పి అతన్ని చేర్పించారు. ఆపరేటర్లు సర్జన్ లేకుండా రాత్రిపూట స్వయంగా ఆపరేషన్ చేశారు.
Also Read:ZPTC Vote Counting: నేడు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప్ప ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలపై ఉత్కంఠ..!
కొన్ని రోజుల తరువాత, రోగి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినప్పుడు, అతను మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ అల్ట్రాసౌండ్ టెస్ట్ లో ఒక మూత్రపిండం కనిపించలేదని వెల్లడైంది. దీంతో ఆ వ్యక్తి షాక్ కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్హెచ్ఓ తెలిపారు. కిడ్నీ తొలగింపు ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.