SSMB29 : సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “గుంటూరు కారం ” సినిమాతో మంచి విజయం అందుకున్నారు.త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ తరువాత సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు.ఈ చిత్రం బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనుంది.ఈ సినిమా మహేష్ 29 వ సినిమా గా తెరకెక్కనుంది.”ఎస్ఎస్ఎంబి 29 ” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది .ఈ సినిమాను శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు .
అలాగే ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ చేంజ్ చేసుకున్నారు.లాంగ్ హెయిర్,గడ్డంతో మహేష్ లుక్ అదిరిపోయింది.ఈ సినిమాను బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే “ఎస్ఎస్ఎంబి 29” మూవీ కాస్టింగ్ గురించి వస్తున్న రూమర్స్ పై చిత్ర యూనిట్ స్పందించింది.ప్రముఖ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా మా చిత్రం కాస్టింగ్ గురించి ప్రచురించిన కథనం మా దృష్టికి వచ్చింది.మా చిత్రంలో వీరెన్ స్వామికి ఏ భాగానికి ,ఏ విధంగానూ ప్రమేయం లేదని తెలిపింది.మా చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటనలు మా ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తే తప్ప ఎలాంటి రూమర్స్ నమ్మొద్దని చిత్ర యూనిట్ ఓ నోట్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈనోట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.