SSMB 29: ఇక పాన్ ఇండియా కాదయ్యా.. పాన్ వరల్డ్ అనాలేమో! ఏకంగా 120 దేశాలలో రిలీజ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 29: భారతీయ సినీప్రేక్షకులతో పాటు వివిధ దేశాలలో ఉన్న మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB 29. సూపర్‌స్టార్ మహేష్ బాబు, అంతర్జాతీయ గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మల్టీ–స్టారర్ యాక్షన్ అడ్వెంచర్‌కి సంబంధించిన మొదటి బిగ్ రివీల్ నవంబర్ 2025లో రానున్న విషయం తెలిసిందే.
Kieron Pollard: 6,6,0,6,6,6,6,6 .. 8 బంతుల్లో 7 సిక్సర్లు.. మాజీ ఆల్‌రౌండర్ ఊచకోత!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇకపోతే రాజమౌళి టీమ్ ఇప్పటికే కెన్యాలో కీలక సన్నివేశాల కోసం లొకేషన్ స్కౌటింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర టీం కెన్యా విదేశీ వ్యవహారాల మంత్రి ముసాలియా ముడవాడిని కలిశారు. దర్శకుడు రాజమౌళిని ఆయన.. దూరదృష్టి ఉన్న విజనరీ దర్శకుడు అంటూ కితాబిచ్చాడు. అంతేకాకుండా, ఆఫ్రికా ఖండంలో కోట్లాది హృదయాలను గెలుచుకున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. అలాగే కెన్యా దేశంలోని అందాలను ప్రపంచానికి చూపించబోతుండడంతో చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
Kadapa: వినాయకుడి విగ్రహంపై రప్పా.. రప్పా..!
ఆ తర్వాత మంత్రి తన ట్వీట్‌లో ఒక భారీ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే.. ‘SSMB 29’ 120 దేశాల్లో విడుదల కానుందని. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకీ లభించని ఈ రిలీజ్, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ రికార్డును కూడా బద్దలు కొట్టనుంది. రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టే తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్లోబల్ ట్రాట్టింగ్ యాక్షన్ అడ్వెంచర్‌లో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లెజెండరీ నిర్మాత కె.ఎల్. నారాయణ తన దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ బిగ్ బడ్జెట్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Kenya this past fortnight became the stage for one of the world’s greatest filmmakers, @ssrajamouli, the visionary Indian director, screenwriter, and storyteller whose works have captured the imagination of audiences across continents.
Rajamouli, with a career spanning over two… pic.twitter.com/T1xCGVXQ64
— Musalia W Mudavadi (@MusaliaMudavadi) September 2, 2025
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!