SS Thaman: అఖండ 2 సినిమా భారీ విజయం సాధించడంతో సినిమా యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రంలో సినిమాకు సంబంధించిన నటీనటులు, మరికొంత మంది అతిధులు, టెక్నికల్ టీం అందరూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మీ అందరికీ తెలుసు డిసెంబర్ ఐదున రావాల్సిన సినిమా 12 వచ్చింది. వాళ్ళు అనుకుంటే ముందరే కేస్ వేయొచ్చు.. ఎప్పుడో ఆపి ఉండొచ్చు.. బట్ కరెక్ట్ గా లాస్ట్ మినిట్ లో వచ్చి సినిమాను ఆపారు. దీని గురించి మీకు తెలుస్తుంది. ఎంత యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది అన్నారు. అందరూ మనది మనమే.. నాదే నేనే.. అని ఉంటున్నారు. అది కాదు, ఇది ‘మనం’ అని వచ్చేటప్పుడే అన్ని కలుస్తాయి అని అన్నారు.
ఇంకా ముఖ్యంగా.. అందరూ ఛానల్ దొరికితే వెళ్లి సలహాలు ఇస్తున్నారు తప్ప, ప్రొడక్షన్ ఆఫీస్ కి వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇంకా బలం వచ్చేది.. చాలా బలం వచ్చేది. ఎందుకంటే, ఎవరిని అడిగినా గోపి, రాము కోటి అంటే అందరూ చాలా మంచివాళ్ళండి.. చాలా చాలా మంచివాళ్ళండి అంటారు. అప్పుడు ఎందుకు వాళ్ళ గురించి బయట తప్పుగా మాట్లాడాలి. వచ్చి ఆఫీస్ కి రండి కూర్చుని మాట్లాడి క్లోజ్ చేయండి. ఛానల్ మైక్ దొరికితే ఎక్కి మాట్లాడడం తప్పు కదా. అందర ఎక్కడికి వెళ్లి ల్యాండ్ అవుతాం అనేది చూడాలి. కాబట్టి ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. మీరందరూ కలిసి ఉండే సమయం వచ్చింది. ఈ పార్టీకి మీరందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరం కలిస్తేనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఏదో ఒక ఇంటి నాలుగు గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్ గా వెళ్తుంది.
మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ. మనకు ఉండే ఫ్యాన్స్ పవర్ వరల్డ్ లో లేదు మనకు ఉండే ఫాన్స్ పవర్ మనకు ఉండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్ లోనూ లేరు. బయట అంతా చాలా ఈర్ష. టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష. చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. కాబట్టి మనందరం కలిసి ఒక నిజంగా అందరం ఒక యూనిటీగా ప్రతి సినిమా నా సినిమానే ఇప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అయినా నేను నన్ను ట్వీట్ చేయమంటే చేస్తాను. నా సినిమాని నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేయకాపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు. ఇది మనం మనది అనే టైం వచ్చేసింది. ఇంక అందరూ కలిసి చక్కగా మాట్లాడుకొని ఒక యూనిటీగా వెళ్లాల్సిన టైం వచ్చింది. కాబట్టి ఎవరైనా ఒక ద ఎవరికైనా దెబ్బ తగిలితే వెళ్లి బ్యాండ్ వెయ్యండి. దానికి వెళ్లి బ్యాండ్ లా వాయించకండి. బయటికెళ్లి అది చాలా తప్పు అది మీరు ఆలోచించేదే తప్పు అది ఆలోచించేది తప్పు. ఇక్కడ ఈ సినిమాకి ఏం బిజినెస్ జరుగుతుందని వరల్డ్ వైడ్ ఎందుకు తెలియాలి. అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న సినిమా. వాళ్ళు గెలవాలని మేమందరం అనుకునే సినిమా ఎవడు ఆపుతాడు. సినిమాని లాస్ట్ మినిట్ లో ఎందుకు ఆపాలి..? సినిమా అని ప్రొడ్యూసర్ ఆపుతాడా..? నా సినిమా ఐదో తారీకు రిలీజ్ అంటే నాలుగో తారీకు సాయంత్రం 7:00 ట్వీట్ చేయాల్సిన కర్మ వాళ్ళకి ఏంటి..? వాళ్ళకి వాళ్ళు ఎంత కుమ్ములిపోయి ఉంటారు.
ఆఫీస్ లో కూర్చుని వాళ్ళు ఎవరైనా ఆలోచించారా..? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళకంటూ ఒక మనుషులు ఉన్నారు. వాళ్ళని నమ్మే పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఆలోచించారా..? ఏం ఆలోచించడం లేదు. జస్ట్ అలా మాట్లాడడం. కాబట్టి ఒకసారి ఆలోచించి చేయండి ఏ విషయమైన సరే అది చాలా ఇంపార్టెంట్ ఊరికే జరగదు. ఈ సినిమా బాక్స్లు బద్దలవుతాయి స్పీకర్లు వెళ్తాయని.. కాల్తాయని.. మాకు తెలుసు. కాబట్టి మేము ధైర్యంగానే ఉన్నాం. ఎందుకంటే మనం దేవుని నమ్ముకుని వెళ్ళాం. కాబట్టి ఒకరోజు దర్శనం దొరుకుతుంది. లేకపోతే వన్ వీక్ తర్వాత దొరుకుతుంది. ఈ వన్ వీక్ తర్వాత మీకు అందరికీ దొరికింది. ఈరోజు మీరందరూ చాలా దీన్ని పెద్దగా రెస్పెక్ట్ చేసి ఈ సినిమాని అందరూ ఈరోజు ఫ్యామిలీస్ అందరూ వెళ్తూ థియేటర్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒకరు కష్టం కాదు దీంట్లో ఒక ఎంత ఒక సినిమా జరగాలంటే ఒక మినిమం 2000 మంది పని చేస్తే గాని ఒక సినిమా రిలీజ్ అవ్వదు. అది ల్యాబ్ నుంచి ఎవడో ఎంతో కష్టపడితే గాని ఒక సినిమా రిలీజ్ అవ్వదు. ఇది ఒక మనిషిది కాదు..
Lionel Messi: మెస్సీ రాకపై సచిన్ భావోద్వేగ వ్యాఖ్యలు.. నంబర్ 10 జెర్సీ బహూకరణ
నాతోనే 600 మంది పని చేశారు. ఈ సినిమాకి 600 మంది ఓన్లీ మ్యూజిక్ డిపార్ట్మెంటే పనిచేసింది. ఇంకా కెమెరాన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉంటారు. అందరూ కలిసి చేస్తేనే కదా సినిమా. మనం అనే టైం వచ్చేసింది. ఇంకా అందరూ మీరందరూ మన ఇండస్ట్రీ పైన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను బయట అన్ని ఇండస్ట్రీలు తిరుగుతాను. అందరికీ తెలుగు ఇండస్ట్రీ అంటే వాళ్ళకి హాలీవుడ్ లెవెల్ లో చూస్తున్నారు మన ఇండియాలో. కాబట్టి మనందరం కలిసి ఇంకా గుట్టుచప్పుడుగా బయట ఎక్కువ ప్రాబ్లం అవుతే వెళ్లి అడ్రస్ చేసి మనం మనంగా ఆ ఈ సినిమాని మన సినిమాని మనం కాపాడుకోప కాపాడుకునే టైం వచ్చేసింది. అలాగే జనవరిలో ఎన్నో రిలీజ్లు వస్తున్నాయి. అందరికీ విజయవంతంగా సక్సెస్ రావాలి. ఆ 2025 ఈరోజు మాకు డాకుతో స్టార్ట్ అయింది. బాలయ్యతో జర్నీ మళ్ళీ అఖండ 2 తో ఫినిష్ అవుతుంది. ఆ ఐదు సినిమాలు ఐదు బ్లాక్ బస్టర్స్ కొట్టాము ఇప్పుడని అన్నారు.