SSMB Update : మహేష్-రాజమౌళిల షూటింగ్ అప్ డేట్స్!
- ఆగస్టు 9న ప్రెస్ మీట్
- రాజమౌళి సెంటిమెంట్
- జేమ్స్ బాండ్ మహేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి, మహేశ్‌బాబు కలయికలో సినిమా చేయబోతున్నారు అని న్యూస్ వచిన్నప్పటి నుండి అటు ఫాన్స్ ఇటు సినీ వర్గాలలో ఆసక్తి రేపింది. ఎప్పుడెప్పడు షూటింగ్ చేస్తారా, అసలు కథ ఏ నేపథ్యంలో ఉండబోతోంది, ఎటువంటి జానర్ లో చేయబోతున్నారా అన్నటువంటి అంచనాలతో షూటింగ్ స్టార్ట్ చేయక మునుపే అదిరిపోయే క్రేజ్ ను సంపాదించింది. ఆ సస్పెన్స్ కు మరికొద్దిరోజుల్లో తేరపడనున్నట్టు వినిపిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను మహేశ్ పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టు9న మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించనున్నారు. గతంలో రాజమౌళి ఏ విధంగా తన నూతన చిత్రాల వివరాలను తెలిపేవారో ఈ చిత్రానికి అదే సెంటిమెంట్ ఫాలో అవ్వనున్నారు దర్శకధీరుడు. ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళితో పాటు మహేశ్ కూడా పాల్గొంటారు. ఈ చిత్ర నేపథ్యం, ముఖ్య పాత్రల్లో నటించే నటీనటుల వివరాలు ప్రెస్ మీట్ లో తెలియజేయనున్నారు.
Also Read
ఆగస్టులో పూజ కార్యక్రమాలు నిర్వహించి, సెప్టెంబరులో వర్క్ షాప్ స్టార్ట్ చేయనున్నారు, రాజమౌళి నిర్వహించబోయే ఈ వర్క్ షాప్ కు హీరో హీరోయిన్లతో పాటు చిత్రంలో నటించబోయే ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా హాజరుకావాలని అందుకు అనుగుణంగా మిగిలిన సినిమాల డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవాలమని సూచించారని సమాచారం అందుతోంది. యూనిట్ మొత్తం పాల్గొనే ఈ వర్క్ షాప్ నెలరోజుల పాటు సాగనుంది. అది ముగిసాక డిసెంబరు నుండి ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉండనుందని, మహేశ్ ఈ చిత్రంలో జేమ్స్ బాండ్ తరహాలో కనిపించబోతున్నాడని రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఏదిఏమైనా, ఏ జానర్ లో వచ్చినా, గతచిత్రాల రికార్డులను రాజమౌళి – మహేశ్ ల చిత్రం తిరగరాస్తుందని ఫ్యాన్స్ నొక్కి వక్కాణిస్తున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
-
Anirudh : అనిరుథ్ – కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
-
IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్‌కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!