యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ఫీవర్ లా మారిపోయింది.. అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా సూపర్ టాక్ దూసుకుపోతుంది.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. ఇక తొలిరోజే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.. సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ కూడా నటించారు.. చిత్ర ప్రమోషన్స్ లో శృతి హాసన్ ఎక్కడా కనిపించలేదు. కానీ ఈ మూవీలో శృతి హాసన్ ఆధ్యగా కథలో కీలకమైన పాత్ర పోషించింది. కనీసం సలార్ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించకపోవడంతో శృతి హాసన్ కి అంత పబ్లిసిటీ రాలేదని చెప్పాలి.. సినిమా విడుదయ్యి కోట్లు కురిపిస్తుంది.. ఈ తరుణంలో శృతి హాసన్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగింది. ఓ ఛానల్ ఓ నిర్వహించే ప్రీ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ షోలో శృతి హాసన్ పాల్గొంది. మోస్ట్ అవైటెడ్ దావత్ అంటూ సాగే ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలయింది… ఆ ప్రోమో వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
యాంకర్ రవి సలార్ సినిమా గురించి అడిగాడు.. అలాగే ప్రభాస్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని ప్రశ్నించాడు. దావత్ అంటే మనకి గుర్తుకు వచ్చేది ప్రభాస్ అని శృతి హాసన్ తెలిపింది. ఫస్ట్ షెడ్యూల్ లో నలుగురు ఉన్నారని ప్రభాస్ కి చెప్పా.. ఒకే పర్వాలేదు అన్నాడు. చూస్తే 400 మందికి విందు భోజనం పంపించాడు. ప్రభాస్ చాలా కేరింగ్ పర్సన్ ని శృతి పేర్కొంది.. చాలా మంచి మనసు కలిగిన వాడు.. సలార్ ఇంత సక్సెస్ కావడానికి కారణం ఈ మూవీలో ప్రభాస్, శృతి హాసన్ పోషించిన పాత్రలే అని రవి అన్నాడు. వెంటనే ఆ అభిప్రాయాన్ని శృతి హాసన్ ఖండించింది. కాదు కాదు.. నేను చెప్పే విషయాన్ని ప్రభాస్ కూడా అంగీకరిస్తాడు. ఏదైనా ఒక విజన్ తోనే ప్రారంభం అవుతుంది. ఆ క్రెడిట్ ప్రశాంత్ నీల్ గారికే దక్కుతుందని చెప్తుంది.. నిజంగా సినిమా అంత బాగా రావడానికి ఆయన కారణం అంటూ ప్రశాంత్ నీల్ పై ఫ్యాన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు..