IND vs SL 3rd ODI: కొలంబోలో నేడు శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య జరిగిన మూడవ వన్డేలో శ్రీలంక టీమిండియా పై భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీమిండియా సీరియస్ ని కోల్పోవాల్సి వచ్చింది. 3 వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ టై కాగా.. చివరి రెండు వన్డేలలో శ్రీలంక విజయం సాధించడంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక నేటి మ్యాచ్లో మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో శ్రీలంక కెప్టెన్ మెన్ డేస్ ఆఫ్ సెంచరీ తో తన బాధ్యతను నిర్వహించగా.. ఆవిష్క ఫెర్నాండో 96 పరుగులతో రాణించి తృతిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
Sri Lanka: శ్రీలంక అధ్యక్ష బరిలోకి రాజపక్సా వారసుడు.. అనూహ్యంగా బరిలోకి!
ఇక తక్కువ స్కోరుని ఛేదించేందుకు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా మొదట్లో కాస్త నిదానంగానే మొదలుపెట్టిన.. వరుస విరామములలో వికెట్లు కోల్పోవడంతో కేవలం 26.1 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 110 పరుగులతో భారీ అపజయాన్ని ఎదుర్కొంది. దీంతో సిరీస్ 2 – 0 శ్రీలంక కైవసం చేసుకుంది. ఇక టీమిండియా బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులతో రాణించగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్ 30 పరుగులతో రాణించారు. ఇక మిగతావారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో మరోసారి దునిత్ వెళ్లలాగే ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి మరోసారి తన సత్తా చాటాడు. రెండో వన్డే మ్యాచ్లో కూడా అతడు ఆరు వికెట్లతో టీమిండియాకు ఓటమిని రుచి చూపాడు. దింతో శ్రీలంక 27 ఏళ్ళ తర్వాత టీమిండియా పై వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.
Jobs In Telangana: తెలంగాణ వైద్య శాఖలో డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్..