Sri Vishnu : వారం గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ కొట్టిన శ్రీ విష్ణు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ కు బ్రేక్ పడింది. గతేడాది #Single చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ కుర్ర హీరోకు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి.
Also Read : Bollywood : కియారా అద్వానీ ఆఫర్స్‌కు అనీత్ పద్దా గండి
Also Read
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్‌కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
ఫిబ్రవరి చివరి వారంలో విడుదలైన ‘విష్ణు విన్యాసం’ చిత్రం శ్రీవిష్ణు మార్క్ కామెడీతో ఆకట్టుకుంటుందని భావించినప్పటికీ, కనీస ఓపెనింగ్స్ రాబట్టడంలో విఫలమైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోవడంతో వీకెండ్‌లోనే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ బాగున్నప్పటికీ, బలహీనమైన కథా కథనాల వల్ల ప్రేక్షకులు ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. డిస్టిబ్యూటర్స్ కు ఈ సినిమా నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక మార్చి మొదటి వారంలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ పరిస్థితి మరోలా ఉంది. ఈ సినిమాకు ఆరంభంలో మంచి రివ్యూలు, మౌత్ టాక్ లభించాయి. వీకెండ్‌లో వసూళ్లు పుంజుకుంటాయని భావిస్తున్న తరుణంలో, ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సినిమాకు శాపంగా మారింది. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా టీవీలకే పరిమితమయ్యారు. దీంతో ఆదివారం నాటి వసూళ్లు భారీగా దెబ్బతిన్నాయి. సోమవారం నాటికి సినిమా కోలుకుంటుందని ఆశించినా, అప్పటికే కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి. దీంతో వరుసగా రెండు చిత్రాలు శ్రీవిష్ణు రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. తదుపరి చిత్రాలతోనైనా ఈ హీరో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్‌లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!