Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Sri Lankan Girl Came To India Like Seema And Anju

Andhra Pradesh: సీమా, అంజు తరహాలో మరో యువతి.. చిత్తూరు యువకుడి కోసం శ్రీలంక నుంచి

Published Date :July 30, 2023 , 3:25 pm
By Rajesh Veeramalla
Andhra Pradesh: సీమా, అంజు తరహాలో మరో యువతి.. చిత్తూరు యువకుడి కోసం శ్రీలంక నుంచి
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోషల్ మీడియాలో పరిచయాల వల్ల కొందరు దేశాల బార్డర్ దాటి తాము ప్రేమించినవారి దగ్గరకు చేరుకుంటున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అంజు- నస్రుల్లా, సీమా హైదర్- సచిన్ మీనాల ప్రేమకథలు సంచలనం రేపాయి. తాజాగా మరో యువతి.. తాను ప్రేమించిన యువకుడి కోసం దేశం దాటి వచ్చింది. శ్రీలంకకు చెందిన ఓ యువతి.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని యువకుడు.. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో.. యువతి చిత్తూరు చేరుకుంది. అంతేకాకుండా వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం వైరల్‌ అవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Multibagger Stocks: రూ.4కి లభించే షేర్ రూ.400 దాటింది.. కొన్ని వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే కోటీశ్వరులయ్యేవారు

చిత్తూరు జిల్లా అరిమాకులపల్లెకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి (28) భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి శ్రీలంకకు చెందిన యువతి శివకుమారి విఘ్నేశ్వరి (25)తో 2017లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యారు. ఫేస్‌బుక్‌లోనే తమ ఆలోచనలు, ఇష్టాఇష్టాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే యువతి టూరిస్ట్‌ వీసాపై భారత్‌కు వచ్చింది. జూలై 8న కొలంబో నుంచి చెన్నైకి చేరుకుంది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి లక్ష్మణ్ చెన్నై వెళ్లాడు. ఆ తర్వాత యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. తన కుటుంబ సభ్యుల అంగీకారంతో జూలై 20న చిత్తూరు జిల్లా వి.కోటలో విఘ్నేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవడంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

PMSBY: కేవలం రూ.20లకే రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం ప్రత్యేకత తెలుసుకోండి

దంపతులిద్దరిని తమ ముందు హాజరుకావాలని చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు. విఘ్నేశ్వరి వీసా గడువు ఆగస్టు 15తో ముగుస్తున్నందున చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) వై.రిశాంత్ రెడ్డి ఆమెకు నోటీసులు జారీ చేశారు. అప్పటిలోగా విఘ్నేశ్వరి శ్రీలంకకు తిరిగి వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. అందుకు విఘ్నేశ్వరి తన దేశానికి తిరిగి వెళ్లేందుకు నిరాకరించింది. ఆమె తన భర్తతో కలిసి జీవించడానికి శాశ్వతంగా ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

Naresh: మా బిల్డింగ్ గురించి మా ప్రెసిడెంట్ ను అడగండి.. నన్ను కాదు

విఘ్నేశ్వరి భారత పౌరసత్వం పొందాలని చూస్తున్నారని, విధివిధానాలు, ప్రమాణాలను కూడా ఆమెకు తెలిపినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదిలాఉంటే, ఓవైపు శాశ్వతంగా భారత్‌లో ఉండేందుకు అభ్యర్థన చేస్తూనే.. మరోవైపు తిరిగి శ్రీలంక వెళ్లకుండా ఉండేలా తన వీసా గడువును పొడిగించాలని కోరుతూ విఘ్నేశ్వరి దరఖాస్తు చేసుకుంది. అయితే భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు వీలుగా పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు దంపతులకు సూచించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • girl
  • india
  • marraige
  • Sri Lanka

తాజావార్తలు

  • Nara Lokesh: ఏపీలో ఉద్యోగల జాతర.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు..!

  • HYDRA : రూ.1200 కోట్ల భూమిపై కాపాడిన హైడ్రా.. ఖానామెట్‌లో అక్రమాలకు ఫుల్ స్టాప్.!

  • Kayadu Lohar: కయాదు లోహార్ క్రేజీ లైనప్.. అమ్మడి దశ తిరిగినట్టేనా?

  • KKR Vice-Captain Curse: వైస్ కెప్టెన్ శాపమా?.. కేకేఆర్ ప్లేయర్స్ వరుసగా పోతున్నారు, నెక్స్ట్ ఎవరంటే?

  • Mrunal Thakur: స్టేజ్‌పై మృణాల్ ఠాకుర్‌కు సారీ చెప్పిన హీరో!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions