పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపొందింది. పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మూడో, చివరి మ్యాచ్ జరిగింది. ఈ సిరీస్‌లో 0-2తో వెనుకబడిన శ్రీలంక.. చివరి టెస్టులో పుంజుకుని 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. శ్రీలంక టీమ్లో 127 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నిస్సాంక.. శ్రీలంక సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి హీరో. అతనికి తోడు.. 32 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా ఉన్న ఏంజెలో మాథ్యూస్ కూడా జట్టు విజయంలో పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 111 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది. చివరిసారిగా 2014లో ఇంగ్లండ్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది.
Read Also: Manipur voilance: మణిపూర్‌లో స్టూడెంట్స్ ఆందోళన.. గవర్నర్ రిజైన్ చేయాలని డిమాండ్
మూడో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకకు 219 పరుగుల విజయ లక్ష్యం ఉంది. 220 పరుగుల టార్గెట్ లో 127 పరుగులు చేసి శ్రీలంక విజయానికి పాతుమ్ నిస్సంక హీరోగా నిలిచాడు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసింది. కెప్టెన్ ఒలీ పోప్ (154) పరుగులతో రాణించాడు. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల తేడాతో వెనుకంజలో ఉన్న శ్రీలంక.. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 156 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో.. 220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. పాతుమ్ నిస్సాంక అజేయ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో.. ఇంగ్లండ్ 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.
Read Also: Breathlessness: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా.. వీటికి సంకేతం..!