పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపొందింది. పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మూడో, చివరి మ్యాచ్ జరిగింది. ఈ సిరీస్‌లో 0-2తో వెనుకబడిన శ్రీలంక.. చివరి టెస్టులో పుంజుకుని 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది.