భారత్‌లో జరగనున్న వన్డే క్రికెట్ ప్రపంచకప్‌కు శ్రీలంక తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో జింబాబ్వేను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి శ్రీలంక ఈ ఘనత సాధించింది. బులవాయోలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకకు ఆతిథ్య జట్టు ఇచ్చిన 166 పరుగుల లక్ష్యాన్ని 33.1 ఓవర్లలోనే సాధించింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ పాతుమ్ నిశాంక అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.