Suryakumar Yadav Surgery: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్ అయింది. స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న సూర్య.. శస్త్రచికిత్స కోసం ఇటీవల జర్మనీ వెళ్లాడు. బుధవారం అతడికి వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫొటోను సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అతి త్వరలో పునరాగమనం చేస్తా అని పేర్కొన్నాడు. ‘శస్త్రచికిత్స…