Sri lanka: శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా?.. భారత టూరిస్టులకు ఫ్రీ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri lanka: శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా.. ఇక నుంచి ఆ దేశానికి వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ద్వీప దేశం పర్యాటక రంగాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల మధ్.. భారతదేశం, ఇతర ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలు జారీ చేసే విధానాన్ని శ్రీలంక మంత్రివర్గం ఆమోదించిందని విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ఈరోజు తెలిపారు.ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా మార్చి 31, 2024 వరకు అమలులో ఉంటుందని విదేశాంగ మంత్రి సబ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశం, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు తక్షణమే ఉచిత ప్రవేశానికి శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ దేశాల నుంచి పర్యాటకులు శ్రీలంకను సందర్శించినప్పుడు రుసుము లేకుండా వీసాలు పొందగలరు.
Also Read: Ayodhya Temple: రామమందిరంలో అర్చకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇవే..
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ద్వీపదేశమైన శ్రీలంకకు పర్యాటకమే ప్రధాన ఆదాయ మార్గంగా ఉంది. పర్యాటకం ద్వారానే శ్రీలంకకు ఆదాయం సమకూరుతోంది. కొవిడ్ మహమ్మారికి తోడు ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం మూలంగా పర్యాటకుల రాక తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి మళ్లీ ఊపిరి పోయాలని శ్రీలంక సర్కారు నిర్ణయించింది. లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే వీసా ఫ్రీ నిర్ణయం తీసుకుంది. గత కేబినెట్ సమావేశంలోనే ఈ అంశం చర్చకు రావడం గమనార్హం. గతంలో 5 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్‌కు అనుమతివ్వాలని భావించగా.. తాజాగా దాన్ని 7కు పెంచుతూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Russia: రష్యా అధ్యక్షుడికి గుండెపోటు.. బెడ్రూంలో కింద పడిపోయిన పుతిన్!
శ్రీలంకకు వెళ్లే పర్యాటకులలో ఎక్కువగా భారత్ నుంచే వెళ్తారు. ఆ తర్వాత రెండో స్థానంలో చైనా ఉంది. 2019 ఈస్టర్ సండే బాంబు పేలుళ్ల తర్వాత 11 మంది భారతీయులతో సహా 270 మంది మరణించగా..500 మందికి పైగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఈ ద్వీపానికి పర్యాటకుల రాక తగ్గింది. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి అపూర్వమైన ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంక.. అధ్యక్షుడు రాజపక్సే రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనకారులతో రాజకీయ అశాంతిని కూడా ఎదుర్కొంది. ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం, ఔషధం, వంటగ్యాస్, ఇతర ఇంధనం, టాయిలెట్ పేపర్, అగ్గిపెట్టెల వంటి అవసరమైన వస్తువులకు తీవ్రమైన కొరతను శ్రీలంక ఎదుర్కొంది. ఇంధనం, వంట గ్యాస్ కొనుగోలు చేయడానికి శ్రీలంక ప్రజలు నెలల తరబడి దుకాణాల వెలుపల గంటల తరబడి లైన్లలో వేచి ఉండవలసి వచ్చింది.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!